సుప్రీం తీర్పు: జగన్‌కు చిక్కులు, మాజీలదీ అంతే

YS Jagan - Mopidevi Venkataramana
ప్రజాప్రతినిధుల అనర్హతపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై చర్చ సాగుతోంది. వైయస్ జగన్‌తో పాటు పలు పార్టీలకు చెందిన ఇతర నేతల పైనా చర్చ సాగుతోంది. ఆస్తుల కేసులో జగన్ అరెస్టై జైల్లో ఉండటంతో ఆయనపై ప్రధానంగా చర్చించుకుంటున్నారు.

ఆస్తుల కేసులో దోషిగా తేలితే మాత్రం జగన్‌కు సమస్యలు తప్పవంటున్నారు. ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ కేసులో జగన్‌తో పాటు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, మోపిదేవి వెంకటరమణలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే జగన్ ఏడాదికి పైగా జ్యుడీషియల్ కస్టడీ కింద జైల్లో ఉన్నారు. దోషిగా తేలి, రెండేళ్లకు పైగా శిక్ష పడితే తీర్పు ప్రకారం అనర్హత వేటు పడుతుంది. అయితే జగన్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మోపిదేవి వెంకటరమణదీ అదే పరిస్థితి. దోషులుగా శిక్ష అనుభవించిన వారు తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుండదు. దీంతో జగన్, మోపిదేవిల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. సుప్రీం తీర్పు అమలైతే మరెంతోమంది నేతలు ఎన్నికలకు దూరమయ్యే అవకాశం ఉంది. అక్రమాస్తుల కేసులోనే నిందితుడైన విజయ సాయి రెడ్డి కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట.

జగన్ ఆస్తుల కేసులోనే కాకుండా పలు పార్టీలకు చెందిన ఇతర నేతలు కూడా పలువురు కేసులు ఎదుర్కొంటున్నారు. మంత్రి పార్థసారథి పైన ఫెరా కేసు ఉంది. అయితే కింది కోర్టు తీర్పుకంటే ముందే అతను పై కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టు కింది కోర్టు తీర్పుపై స్టే విధించింది. ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా పలువురు కేసులు ఎదుర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+