'జగన్, విజయ సాయిలను వేరు చేయండి'

జగన్, విజయ సాయిలు ఒకే జైలులో ఉంటే బయటి వ్యక్తుల ద్వారా కేసులోని ఆధారాలను, సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశముందని సిబిఐ ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమాస్తుల కేసులో ఇంకా ఆరు ఛార్జీషీట్లు దాఖలు చేయాల్సి ఉన్నందున ఈ కేసులో కీలకంగా ఉన్న వారు ప్రభావితం చేయకుండా ఉండాలంటే వారిని వేర్వేరు జైళ్లలో ఉంచాలని కోరింది. సిబిఐ పిటిషన్ పైన విచారణను కోర్టు ఈ నెల 10వ తేదికి వాయిదా వేసింది.
అక్రమాస్తుల కేసులో సాయిని సిబిఐ మొదట అరెస్టు చేసింది. ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు. గత నెల 9న సుప్రీం కోర్టు ఆయన బెయిలును రద్దు చేసింది. నాలుగు రోజుల క్రితం కోర్టులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో జగన్, సాయిలు ఒకే జైలులో ఉండవద్దని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. కాగా, గతంలో వీరిద్దరు జైలులో ఉన్నప్పుడు ఇద్దరు చంచల్‌గూడ జైలులోనే ఉన్నారు. వారు ఒకే జైలులో ఉన్నప్పటికీ వేరువేరు సెల్‌లో ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
జైలు అధికారి సెల్ గల్లంతు
చంచల్‌గూడ జైలులో సిబిఐ అధికారి సెల్ ఫోన్ గల్లంతై రెండు రోజుల త్రవాత దొరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఈ నెల 5న విజయ సాయి రెడ్డి న్యాయస్థానం నుంచి జైలుకు తరలించిన సమయంలో సిబిఐ అధికారులు జైలు గేటు లోపలన తమ సెల్ ఫోన్‌లను డిపాజిట్ చేశారు. తిరిగి జైలు నుంచి బయటకు వెళ్లే సమయంలో ఓ అధికారి సెల్ గల్లంతైనట్లు గమనించారు. అయితే, ఒకరి సెల్ ఫోన్ మరొకరు తీసుకెళ్లడంతో ఇలా జరిగిందని జైలు సూపరింటెండెంట్ తెలిపారు.












Click it and Unblock the Notifications