బాబుకు 'ఎన్నికల' విశ్రాంతి!: షర్మిల ఎక్కడో?

పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి(కోడ్) అమల్లోకి రానున్న దృష్ట్యా చంద్రబాబు యాత్రను వాయిదా వేసుకోనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి 21న పోలింగ్ జరగనుంది. 19వ తేది సాయంత్రం ఐదు గంటల నుండి ఎన్నికల నియమావళి ఉల్లంఘన అమల్లోకి వస్తుంది. దీంతో అప్పటి నుండి 21 సాయంత్రం వరకు బాబు పాదయాత్రకు బ్రేక్ రానుంది.
జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు ఎన్నికల నియమావళి కాపీని ఇచ్చేందుకు ఎన్నికల అధికారులు సిద్దమయ్యారు. 19వ తేదిన పాదయాత్ర ఎక్కడకు చేరుకుంటే అక్కడే బస చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కూడా తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు రెండు రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు. ఎన్నికల నియమావళి నాటికి షర్మిల పాదయాత్ర నల్గొండ జిల్లాలోనే ఉండే అవకాశముంది.
బాబు పాదయాత్ర గుంటూరు జిల్లాలో ఉంటుంది. దీంతో తన పాదయాత్ర ఆగిన ప్రాంతంలోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, షర్మిల ఆ రెండు రోజుల పాటు ఎక్కడుంటారో ఇంకా నిర్ణయించలేదు. ఈ రోజు పార్టీ చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఆమె బస పాదయాత్ర ప్రాంతంలోనే ఉంటుందా? లేక హైదరాబాద్ వస్తుందా? అనేది తెలియరాలేదు.












Click it and Unblock the Notifications