తెరపడిందా? పురంధేశ్వరి చెప్పారన్న టిఎస్సార్

తాను నరసారావుపేట లోకసభ స్థానం నుండి పోటీ చేస్తానని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు. అయితే, నిజంగానే ఆమె కోరిందా లేదా అనేది ఆమె చెబితే గాని తెలియదు. టిఎస్సార్ మాత్రం తాను విశాక నుండే వచ్చేసారి పోటీ చేస్తానని ఆమె నరసారావుపేటకు వెళ్తారని చెప్పారు. ఆయన విశాఖలో టిఎస్సార్ కళా పీఠం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఈశ్వర తపస్విని అని, తనకు దైవ రహస్యం తెలుసునని చెప్పారు.
2014 ఎన్నికల్లో తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం విశాఖ ఎంపిగా ఉన్న పురందేశ్వరి నరసరావుపేట నుంచి పోటీ చేస్తారన్నారు. తాను విశాఖ నుంచి, పురందేశ్వరి నరసరావు పేట నుంచి పోటీ చేస్తే ఇద్దరం తిరుగులేని విజయం సాధిస్తామని, ఈ విషయంలో అనుమానాలకు తావు లేదన్నారు. తాను కూడా విశాఖ నుంచే పోటీ చేస్తానని పురందేశ్వరి చెబుతున్నారని విలేకరులు గుర్తు చేయగా 'మీలాంటి వారెవరో ఆమెకు ఇలాంటి సలహా ఇచ్చి ఉంటార'ని అన్నారు.
ప్రజలకు సేవ చేయాలంటే మనసు, శక్తి ఉండాలని ఆ రెండూ తనకు ఉన్నాయన్నారు. విశాఖలో వంద దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, త్వరలోనే 20 దేవాలయాలను ప్రారంభిస్తామని చెప్పారు. అదేవిధంగా 20 మసీదులు, 20 చర్చిలు నిర్మించనున్నట్టు చెప్పారు. వీటితోపాటు 50 అంబేద్కర్ విగ్రహాలు, 30 జగ్జీవన్‌రామ్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 11న తొలిసారిగా టిఎస్సార్ ఫౌండేషన్ ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దడానికి టిఎస్సార్ క్రీడాపీఠం ప్రారంభిస్తున్నట్టు వివరించారు.












Click it and Unblock the Notifications