జగన్‌ను ఎదుర్కోలేరనే తెలంగాణ వైపు?

తెలంగాణను అడ్డుకోవాలంటే వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కునే మెజారిటీ సీట్లు సాధించి పెడతామనే హామీని నమ్మేవిధంగా వివరించాల్సి ఉంటుందని సీమాంధ్ర నాయకులే అంటున్నారు. దానికితోడు, సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు నాయకులు పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వంతో సంబంధాలు కొనసాగిస్తున్నారని, అవసరమైతే అటువైపు వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. ఈ విషయం సీమాంధ్ర నాయకుల సమావేశంలో కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ స్థితిలో రెండు ప్రాంతాల్లో నష్టపోయే కన్నా తెలంగాణ ఇచ్చి ఒక ప్రాంతంలోనైనా మెజారిటీ సీట్లు గెలుచుకోవడం అవసరమని కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. తాము జగన్‌ను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నామన్న భావనను అధిష్ఠానం మది నుంచి తొలగించాలంటే ఇకపై తామంతా జగన్ పార్టీని ఎదుర్కోవడం ద్వారా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని సూచించారు. లేకపోతే రాష్ట్ర విభజన అడ్డుకోలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే పార్టీ ప్రయోజనాలను కాపాడుతామే గట్టి నమ్మకం కలిగించడంలో సీమాంధ్ర నాయకులు విఫలమైనట్లు కూడా భావిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ నాయకులు తమపై ఆధిక్యతను చాటుకున్నారని అంటున్నారు. ఆదివారంనాడు తెలంగాణ నాయకులు నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడం, దాన్ని విజయవంతం చేయడానికి తెలంగాణ నాయకులు ప్రదర్సించిన ఐక్యత అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. తెలంగాణ ఇస్తే ఇదే ఐక్యతతో కాంగ్రెసు పార్టీని గెలిపిస్తామని వారు చాటినట్లు అయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications