టియే కీ, జగన్‌కు జై: చిరుకు రెండే(పిక్చర్స్)
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని 25 శాతం మంది కోరుకుంటున్నారట. అదే సమయంలో జగన్ అవినీతి నిజమేనని 34 శాతం మంది చెప్పారట. తెలంగాణపై ఆధారపడే ఓటు వేయాలని రాష్ట్రంలో సగాని కంటే ఎక్కువ మంది నిర్ణయించుకున్నారట. సిఎన్ఎన్-ఐబిఎన్, సిఎస్‌డిఎస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో ఎక్కువ మంది జగన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నట్లుగా తేలింది.
జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వారు 25 శాతం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును 17 శాతం, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును 12 శాతం, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని 8 శాతం, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని 2 శాతం మంది కోరుకుంటున్నారు. 2009 ఎన్నికల్లో చిరుకు 17 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వారి సంఖ్య 2 శాతానికి పడిపోయింది.
లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణనను ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వారి శాతం ఐదుగా ఉంది. ఎవరు కావాలో చెప్పలేమని ఇరవై శాతం మంది చెప్పారు. లోకసభ సీట్ల విషయానికి వస్తే మాత్రం భిన్నంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెసు 11-15, వైయస్సార్ కాంగ్రెసు 11-15, తెలుగుదేశం 6-10, తెరాస 5-9 సీట్లలో గెలుస్తుందని సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో టిడిపి 25 శాతం ఓట్లు పొందగా, వచ్చే ఎన్నికల్లో 17 శాతానికి తగ్గనుంది.

జగన్, తెలంగాణ
లోకసభ ఎన్నికలలో తెలంగాణ అంశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలే ప్రభావం చూపనున్నారని సర్వే చెబుతోంది. తెలంగాణపై వైఖరి ద్వారా ఓటు వేస్తామని రాష్ట్రవ్యాప్తంగా 55 శాతం మంది చెప్పగా, అందులో తెలంగాణ నుండే 88 శాతం మంది ఉన్నారు.

కింగ్ ఆర్ కింగ్ మేకర్
వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్న వారు 25 శాతం ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు 17 శాతంతో రెండో స్థానంలో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 8 శాతంతో ఉన్నారు. అదే సమయంలో జగన్ అవినీతిని నమ్ముతున్న వారు 34 శాతం మంది ఉన్నారు.

తగ్గిన చిరు ఇమేజ్!
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రిగా కావాలనుకుంటున్న వారు కేవలం 2 శాతంగా మాత్రమే ఉందట. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరును చూసే 17 శాతం ఓట్లు పడ్డాయి. ఇప్పుడు చిరును సిఎంగా కోరుకుంటున్న వారి శాతం చాలా తగ్గింది. అయితే ఆయన కేంద్రమంత్రిగా ఉండి.... ప్రజలకు కొంత దూరంగా ఉండటం, పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయడం వంటి అంశాలు ప్రభావం చూపాయని చెప్పవచ్చు.

బాబుకు 17, కిరణ్‌కు 8, కెసిఆర్ 12
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా కోరుకుంటున్న వారి శాతం 17 ఉండగా, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరుకుంటున్న వారు 8 శాతం, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కోరుకుంటున్న వారు 12 శాతం మంది ఉన్నారు.

జయలలిత హవా
తమిళనాడులో వచ్చే లోకసభలో ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె హవానే కొనసాగనుంది. గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లోనే గెలిచిన అన్నాడిఎంకే ఈసారి 16-20 స్థానాలను గెలుచుకోనుంది. డిఎంకే సీట్లు 18 నుండి 8నుండి12కు పడిపోనున్నాయి.

కర్నాటకలో మరోసారి కమలంకు దెబ్బ
గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక ప్రజలు కాంగ్రెసు పార్టీకి పట్టం గట్టారు. లోకసభ ఎన్నికలలోను అధికార పార్టీనే ఎక్కువ సీట్లలో గెలిపంచనున్నారట. గతంలో వచ్చిన దానికంటే కాంగ్రెసు మూడింతలు రెట్టింపు సీట్లను గెలుచుకోగా, అంతే స్థాయిలో బిజెపికి తగ్గనున్నాయి.
ఇక జగన్ పార్టీ పైన అవినీతి ఆరోపణలు 34 శాతం మంది నిజమని చెప్పగా, 29 శాతం మంది అబద్దమని చెప్పారు. భారతీయ జనతా పార్టీకి గతంలో ఓట్ల శాతం నాలుగు ఉండగా.. ఇప్పుడు ఏడుగు పెరుగనుంది. తెలంగాణపై వైఖరి ద్వారానే ఓటు వేయాలని 55 శాతం మంది భావిస్తున్నారు. తెలంగాణవాదుల్లో 88 శాతం మంది, సమైక్యాంధ్ర మద్దతుదారుల్లో 36 శాతం మంది తెలంగాణ ఆధారంగా ఓటు వేస్తామని చెప్పారు.
తమిళనాడ ఓటర్లు మరోసారి ముఖ్యమంత్రి జయలలితకు పట్టం కట్టనున్నారు. గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లోనే గెలిచిన అన్నాడిఎంకే ఈసారి 16-20 స్థానాలను గెలుచుకోనుంది. డిఎంకే సీట్లు 18 నుండి 8నుండి12కు పడిపోనున్నాయి. జయలలిత పాలన పట్ల గతంలో 70 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, ఇప్పుడు 65 శాతానికి తగ్గింది. అసంతృప్తి అప్పుడు 16 శాతం ఉండగా, ఇప్పుడు 28 శాతానికి చేరింది.
దక్షిణాదిన మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పర్చి సంచలనం సృష్టించిన బిజెపి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీకి మరోసారి పరాభవం తప్పేలా లేదు. కాంగ్రెసుకు 2009లో ఓట్ల శాతం 32 ఉండగా, ఇప్పుడు 47 శాతంగా ఉంది. 18-22 ఎంపీ స్థానాలను గెలుచుకోనుంది. ప్రస్తుతం ఆ పార్టీకి ఆరుగురు ఎంపీలు న్నారు.
బిజెపి ఓట్ల శాతం 20కి పడిపోయి ఆరు సీట్లకు పరిమితం కానుంది. ప్రస్తుతం ఆ పార్టీ ఎంపీల సంఖ్య 19గా ఉంది. బిజెపి నుండి విడిపోయి కెజెపిని స్థాపించిన యడ్యూరప్పకు ప్రయోజనం ఏమీ ఉండకున్నా, బిజెపిని దెబ్బతీస్తారు. యడ్డీ బిజెపిలోకి వెళ్లాలని 32 శాతం మంది చెబుతుండగా, 27 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. దేవేగౌడ నేతృత్వంలోని జెడిఎస్ కూడా ఆరు సీట్లు కైవసం చేసుకోనుంది.












Click it and Unblock the Notifications