ఎన్టీఆర్: బాబుపై జగన్ పార్టీ రివర్స్ ఆటాక్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్‌ను యుగపురుషుడు, కారణజన్ముడంటూ పాదయాత్రలో పొగుడుతున్న చంద్రబాబు 1995లో ఆయన గురించి ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని వైయస్స్రా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ సూచించారు. "వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం నుంచి ఎన్టీ రామారావును దించేసినప్పుడు మీరు మాట్లాడిన మాటలేంటి? వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన ఘటనలు తెలుగు ప్రజలు మరిచిపోయారని అనుకుంటున్నారా?" అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తర్వాత ‘ఇండియాటుడే' ప్రతినిధి అమర్‌నాథ్ కె.మీనన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఏం మాట్లాడారో బాబు గుర్తుచేసుకోవాలని ఆయన అడిగారు. ‘ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవన్నావు. తెలుగుదేశం పార్టీ అసలు ఎన్టీఆర్‌దే కాదన్నావు. పార్టీతో సంబంధం లేదన్నావు. ఆయనకు మతిస్థిమితం లేదంటూ పార్టీ సభ్యత్వ పుస్తకాల్లో ఎన్టీఆర్ బొమ్మను తొలగించావు' అని విరుచుకుపడ్డారు. తండ్రిని జైల్లో పెట్టి అధికారం కోసం సోదరుల్ని చంపించిన జౌరంగజేబు కంటే చంద్రబాబు నీచుడని ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను జనక్‌ప్రసాద్ గుర్తుచేశారు.
లోకేష్ బాగోతమంటూ....
నిత్యం తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్న చంద్రబాబు కుమారుడు లోకేష్ బాగోతాలను బయటపెడితే మహిళలు చీపుర్లు పట్టుకొని వెంటపడి తరిమి కొడతారని హెచ్చరించారు. సంస్కారం ఉంది కాబట్టి ఆ విషయాల జోలికి వెళ్లటం లేదన్నారు. మొత్తం మీద, తెలుగుదేశం పార్టీలోని అంతర్గత తగాదాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications