'టీ'లో పసునూరి చరిత్ర: 5గురు తెలుగువారే!
హైదరాబాద్: 1952 నుంచి 2015 వరకు లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన టాప్ 10 జాబితాలో ఏకంగా ఏదుగురు తెలుగు రాజకీయ నేతలు ఉన్నారు. టాప్ 5లో వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉన్నారు.
టాప్ 10 జాబితాలో కేసీఆర్, దివంగత సీఎం వైఎస్ఆర్‌లతో పాటు తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్ నిలిచారు. బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండే కూతురు ప్రీతమ్ ముండే 2014 ఎన్నికల్లో ఏకంగా 6.92 లక్షల మెజారిటీతో ప్రథమ స్థానంలో ఉన్నారు.

తాజాగా వరంగల్ లోక్‌సభకు ఉపఎన్నికలో అత్యధిక మెజారిటీ సాధించి పసునూరి దయాకర్ చరిత్ర సృష్టించారు. తెలంగాణలో వరంగల్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ప్రాతనిధ్యం వహిస్తున్న కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానం ఖాళీ అయింది.
తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి అయిన పసునూరి దయాకర్‌ను టీఆర్ఎస్ బరిలో నిలిపింది. ఈ ఉపఎన్నికలో ఆయన 4,59,092 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దేశంలోనే రికార్డు స్థాయి ఆధిక్యంలో గెలుపొందిన వారిలో పసునూరి దయాకర్ 8వ స్థానంలో నిలిచారు.

అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీకి వచ్చిన అత్యధిక మెజార్టీ కూడా ఇదే కావడం విశేషం. గతంలో 2014లో మెదక్ లోక్‌సభ స్థానానికి సీఎం కేసీఆర్ అత్యధిక మెజారిటీ 3,97,029 సాధించారు. ఇప్పటివరకు ఇదే తెలంగాణలో అత్యధికం. ఆ తర్వాత మెదక్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కొత్త ప్రభాకర్ రెడ్డి 3,61,277 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.
ఇక తాజాగా 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానంలో కడియం శ్రీహరి సాధించిన 3,92,574 ఆధిక్యాన్ని కూడా పసునూరి దయాకర్ అధిగమించారు.












Click it and Unblock the Notifications