వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వస్తూ పోతుంటా: మోడీ, మీ ఇల్లే అనుకోండి: షరీఫ్‌

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా పాకిస్థాన్ వెళ్లి అందర్నీ ఆశ్చర్యపర్చిన విషయం తెలిసిందే. కాగా, పాకిస్థాన్‌లో తొలిసారి పర్యటించిన నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఘన స్వాగతం పలికారు.

అంతేగాక, మోడీని షరీఫ్‌ తమ ఉమ్మడికుటుంబం నివాసం ఉండే భవనానికి తీసుకెళ్లి కుటుంబసభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. షరీఫ్ తల్లికి పాదాభివందనం చేశారు.

కాగా, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌ 66వ జన్మదినం సందర్భంగా ఆయనను స్వయంగా కలుసుకోవటానికి లాహోర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లిన సందర్భంగా వారిద్దరి మధ్య ఆత్మీయ సంభాషణ చోటు చేసుకుంది.

A hug and high tea: Indian PM makes surprise visit to Pakistan

లాహోర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆ సమయంలో జరిగిన సంభాషణల వివరాల్ని అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవారు శనివారం వెల్లడించారు. ‘షరీఫ్‌ తన కుటుంబసభ్యుల్ని మోడీకి పరిచయం చేశారు. వారికి ఆయన అభివాదం చేసి పలుకరించారు. అనంతరం షరీఫ్‌ తల్లికి పాదాభివందనం చేశారు' అని తెలిపారు.

‘షరీఫ్‌ మనవరాలి పెళ్లి వేడుకలు కూడా అదేసమయంలో జరుగుతున్న నేపథ్యంలో.. అక్కడున్న మహిళలకు మోడీ చీరలను, ఇతర బహుమతులను అందజేశారు' అని ఆ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మోడీ.. షరీఫ్‌తో మాట్లాడుతూ.. మీ కుటుంబసభ్యులు అందరూ ఇక్కడే నివసిస్తారా? అని ప్రశించారు.

దానికాయన బదులిస్తూ అవును! 70-80 మంది కుటుంబసభ్యులు ఇక్కడే ఉంటారని తెలిపారు. ‘ఇకనుంచీ ఇక్కడికి రావటం పోవటం జరుగుతుంది. ఇలాంటి సమావేశాలూ జరుపుతూ ఉందాం' అని మోడీ అన్నారు. దీనికి సమాధానంగా ‘తప్పకుండా ఇది మీ ఇల్లే అనుకోండి' అని షరీఫ్‌ పేర్కొన్నట్లుగా ఆ వర్గాలు వెల్లడించాయి.

శుక్రవారం ఉదయం అఫ్గానిస్థాన్‌ పర్యటనలో ఉన్న మోడీ.. నవాజ్‌షరీఫ్‌కు ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు.. ఆయన ఆహ్వానించటం, దానికి మోడీ సరేననటంతో రెండున్నర గంటల లాహోర్‌ ఆకస్మిక పర్యటనకు బీజం పడిన విషయం తెలిసిందే.

English summary
Indian Prime Minister Narendra Modi made a surprise stopover in Pakistan on Friday to meet his counterpart, Nawaz Sharif, the first time an Indian premier has visited the rival nation in over a decade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X