నంద్యాల ఎఫెక్ట్: కెసిఆర్ పాత అస్త్రం, ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు

Posted By:
Subscribe to Oneindia Telugu
  KCR strategy over Bypoll in Telanganaనంద్యాల ఎఫెక్ట్ కెసిఆర్ అస్త్రం ఒక్క దెబ్బకు 2 పిట్టలు|Oneindia

  హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ఉన్న సమయంలో తెలంగాణ సీఎం కెసిఆర్ ఉప ఎన్నికతో తమ బలం నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

  నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అద్భుత విజయం సాధించింది. ఈ కారణంగానే కెసిఆర్ కూడా ఉప ఎన్నిక అనే అస్త్రాన్ని బయటకు తీయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉప ఎన్నికలు పలుమార్లు వచ్చాయి.

  నంద్యాలలో టిడిపి గెలుపు అనంతరం ఇప్పుడు మరోసారి తన ఉప ఎన్నిక అస్త్రాన్ని ప్రయోగించాలని చంద్రబాబు అనుకుంటున్నారని తెలుస్తోంది. తద్వారా తమకు ఉన్న ప్రజాబలాన్ని నిరూపించుకోవాలని భావిస్తోంది.

  ఒక్క దెబ్బకు.. కెసిఆర్ వ్యూహం

  ఒక్క దెబ్బకు.. కెసిఆర్ వ్యూహం

  ఒకే ఒక్క దెబ్బతో ఎన్నో పిట్టలను కొట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారని తెలుస్తోంది. నంద్యాలలో టిడిపి - వైసిపి పోటాపోటీగా కనిపించాయి. కానీ తీరా ఫలితాలు చూశాక.. వైసిపికి అంత సీన్ లేదని తెలిసింది. తెలంగాణలో విపక్షాలకు అంత సీన్ లేదని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. ఉప ఎన్ని ద్వారా అది నిరూపించాలని భావిస్తున్నారని సమాచారం.

  దారుణంగా దెబ్బతీయాలని

  దారుణంగా దెబ్బతీయాలని

  షెడ్యూల్‌ ప్రకారం లోకసభ, అసెంబ్లీ ఎన్నికల గడువు 20 నెలలు ఉంది. అంతకంటే ముందే నంద్యాల మాదిరిగా ఇక్కడ కూడా ఒక ఉప ఎన్నికను ఎదుర్కొని విజయం సాధిస్తే, వచ్చే ఎన్నికల్లోనూ తెరాసకు తిరుగుండదని తేలిపోతుందని, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నీ తప్పుబడుతూ కయ్యానికి కాలు దువ్వుతున్న విపక్షాల విశ్వాసాన్ని సార్వత్రిక ఎన్నికల ముంగిట దారుణంగా దెబ్బతీయవచ్చని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

  నాడు తెలంగాణ సెంటిమెంట్ కావొచ్చు..

  నాడు తెలంగాణ సెంటిమెంట్ కావొచ్చు..

  2014 సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర విభజన నిర్ణయం, తెలంగాణ సెంటిమెంట్‌తోనే విజయం సాధించిందనే పేరున్న తెరాస వచ్చే ఎన్నికలను తమ ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా భావిస్తోంది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సర్వేల్లో పార్టీకి అనుకూలంగా మెరుగైన ఫలితాలే వస్తున్నా జనాభిప్రాయానికి అద్దం పట్టేలా, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల ఆశీర్వాదం ఉందా? లేదా? అనే విషయం ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి వీలుగా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

  అధికార పార్టీగా తొలిసారి.. కేసీఆర్ ఆలోచన ఇదీ

  అధికార పార్టీగా తొలిసారి.. కేసీఆర్ ఆలోచన ఇదీ

  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో అనేక ఉప ఎన్నికలను ఎదుర్కొన్న తెరాస.. అధికార పార్టీగా తొలిసారి స్వీయ ఉప ఎన్నిక పరీక్షకు సిద్ధపడినట్లుగా సమాచారం. ఇప్పుడు ఉప ఎన్నికకు సిద్ధపడితే వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిపాటు రాష్ట్రంలో అదే చర్చ కొనసాగుతుందని, ఉప ఎన్నిక ఫలితం వాడివేడి తగ్గేలోపు సాధారణ ఎన్నికలు వస్తాయనేది కెసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.

  ఇక్కటే ట్విస్ట్

  ఇక్కటే ట్విస్ట్

  ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికల్లో నెగ్గి ఆ పార్టీ బహుళ ప్రయోజనాలను పొందింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితి బాగుంటుందని అంతా భావిస్తున్న క్రమంలో ఆ పార్టీ ఇప్పుడు ఉప ఎన్నికల సవాల్‌కు సిద్ధపడుతుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

  నల్గొండ నుంచే ప్రయోగం

  నల్గొండ నుంచే ప్రయోగం

  నల్గొండ నుంచే ఈ ప్రయోగం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిచే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని తెలుస్తోంది. రైతు సమన్వయ సమితి (ఆర్‌ఎస్ఎస్‌) రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ పదవికి గుత్తాను నామినేట్‌ చేసి, కేబినెట్‌ హోదా ఇవ్వాలని కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయనతో నల్గొండ ఎంపీ పదవికి రాజీనామా చేయించి, ఉప ఎన్నికకు వెళ్లాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారని సమాచారం. అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక తీసుకొస్తే, దాని ప్రభావం రాష్ట్రానికే పరిమితం అవుతుందని, అదే లోకసభ స్థానానికి ఉప ఎన్నిక తీసుకొస్తే, జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడుతుందని, అటువంటి ఎన్నికల్లో విజయం సాధించటం ద్వారా కేవలం రాష్ట్రంలోనే కాకుండా, జాతీయ స్థాయిలోనూ టీఆర్‌ఎస్‌ బలం ఏమిటో తెలుస్తుందనేది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.

  నల్గొండ నుంచి ఎందుకంటే..

  నల్గొండ నుంచి ఎందుకంటే..

  బలమైన కారణాలతోనే సీఎం కేసీఆర్‌ నల్లగొండ లోకసభ స్థానం ఉప ఎన్నిక దిశగా ఆలోచన చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ గెలిచిన స్థానాల్లో ఉత్తర తెలంగాణదే సింహభాగం. దక్షిణ తెలంగాణలో పెద్దగా రాణించలేదు. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు కేవలం ఆరింటినే గెల్చుకుంది. ఆ జిల్లాలోని రెండు లోకసభ స్థానాల్లో ఒకటైన నల్గొండలో ఓడిపోయింది. రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న జిల్లాల్లో నల్గొండలో ముందు వరుసలో నిలుస్తుంది. మిగిలిన జిల్లాలతో పోల్చితే కాంగ్రెస్‌ అక్కడే కొంత పటిష్ఠంగా ఉంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన, కాంగ్రెస్‌ గెల్చిన ఏకైక స్థానం నల్గొండనే. అంతేనా, కాంగ్రెస్‌ దిగ్గజాలు సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు ఉమ్మడి నల్గొండకు చెందినవారే. నల్గొండ లోకసభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో ఒక్క సూర్యాపేట తప్ప మిగిలిన ఆరింటిలో టీఆర్‌ఎస్‌ 2014లో గెలవలేదు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Present TRS Leader, Congress MP Gutta Sukhendar Reddy has resigned to his MP post it seems. On 14th of this month he is going to submit his resignation letter officially to the Hon'ble Lok Sabha Speaker. After that in the Nalgonda Bypoll again he is going to contest as TRS candidate. This is the strategy prepared by the Telangana CM KCR. Along with the MP seat, CM KCR thinking that go for MLA election in Mahaboob Nagar District.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X