శోభన్-జయల మధ్య స్నేహాన్ని మించి?: 'అమృత' వాళ్ల బిడ్డే.. 'అప్పట్లో ఆయనే చెప్పారని!'

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత అంతర్గత జీవితం గురించి తెలిసినవారు అతికొద్ది మాత్రమే. ఆమె జీవితంలో చాలా రహస్యాలు ఉన్నాయన్న ప్రచారం ఉన్నప్పటికీ.. ఇంతవరకూ ఏ ఒక్కటీ వెలుగుచూడలేదు.

తాజాగా జయలలిత వారసురాలినంటూ అమృత(37) అనే యువతి తెరపైకి రావడం.. డీఎన్ఏ టెస్టుకైనా సిద్దమని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆమె న్యాయ పోరాటానికి కూడా సిద్దమవడం.. అటు జయలలిత బంధువు లలిత కూడా 'అమృత' జయలలిత బిడ్డనే అంటూ కుండబద్దలు కొట్టడం చూస్తుంటే ఈమె అమ్మకు నిజమైన వారసురాలే అన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

ఆ అభిప్రాయాలకు బలం చేకూర్చేలా జయలలిత స్నేహితురాలు గీత కూడా లలిత వాదనను సమర్థించడం గమనార్హం.

గీత ఏమన్నారు:

గీత ఏమన్నారు:

అమృత జయలలిత కుమార్తేనని జయలలిత స్నేహితురాలు గీత స్పష్టం చేశారు. నటుడు శోభన్ బాబు, జయలలితకు ఆమె జన్మించిందని పేర్కొన్నారు. జయలలిత నెచ్చెలి శశికళకు కూడా ఈ విషయం తెలుసన్నారు. ఓ ఇంటర్వ్యూలో జయలలిత గురించి ప్రస్తావన వచ్చిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

జయలలికు కుమార్తె ఉన్న మాట నిజమే: 1980లో, ఎవరు అనేది, బాంబుపేల్చిన లలిత !

శోభన్ బాబు కూడా చెప్పారు:

శోభన్ బాబు కూడా చెప్పారు:


అమృత జయలలిత బిడ్డే అన్న వాదనకు మరింత బలం చేకూర్చే విషయాన్ని కూడా గీత ప్రస్తావించారు. 1999లో తానోసారి శోభన్‌బాబు ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో తనకో కుమార్తె ఉన్న విషయాన్ని శోభన్ బాబు తనతో ప్రస్తావించారని, ఆమె పేరు అమృత అని కూడా చెప్పారని గుర్తుచేసుకున్నారు.

డీఎన్ఏలోనే తేలుతుంది?:

డీఎన్ఏలోనే తేలుతుంది?:

1996 నుంచి జయలలితతో అమృతకు సంబంధాలు ఉండేవన్నారు గీత. అమృత.. జయలలిత కూతురా? కాదా? అన్న విషయంపై ఇంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. అసలు విషయం డీఎన్ఏ పరీక్షల్లోనే తేలుతుందని, అప్పటి వరకు వేచి చూడాలని గీత పేర్కొన్నారు.

నేను జయలలిత, శోభన్ బాబుల కొడుకును: ఇదే సాక్ష్యం, మాయం, ఎంజీఆర్!

స్నేహాన్ని మించిన బంధం:

స్నేహాన్ని మించిన బంధం:

జయలలిత-శోభన్ బాబుల మధ్య స్నేహాన్ని మించిన సంబంధం ఉందనే దానికి 'అమృత' అనే ప్రత్యక్ష ఉదాహరణ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి శోభన్ బాబు సినిమాల్లో వచ్చేనాటికే జయలలిత పెద్ద స్టార్ కాగా.. ఆమెతో సినిమా చేయడానికి శోభన్ బాబుకు ఎనిమిదేళ్లు పట్టింది.

తల్లి మరణం తర్వాత కుంగిపోయిన జయలలితకు శోభన్ బాబు స్నేహం కొత్త ఆశలు రేకెత్తించిందని చెబుతారు. అప్పటికే శోభన్ బాబుకు పెళ్లయినప్పటికీ..జయలలితను రెండో భార్యగా చేసుకునేందుకు ఆయన అంగీకరించారన్న ప్రచారం కూడా ఉంది. ఏదేమైనా వారి ప్రేమకు ప్రతిరూపమే అమృత అన్న ప్రచారం ఇప్పుడు జోరందుకుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Late CM Jayalalithaa's friend Geeta made sensational comments about her personal life, she said Jaya have a daughter with Shobhan Babu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి