మరో షేక్ అక్రమ పెళ్లి: చేయకపోతే హింసిస్తానని!; అతను 64, ఆమె 14..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మరో కాంట్రాక్టు పెళ్లిని పోలీసులు రద్దు చేశారు. పెళ్లి జరిపిస్తున్న మత పెద్దతో పాటు బహరైన దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

మేం సెక్స్ కోసం.. మీవాళ్లు డబ్బు కోసం: షేక్ చెప్పినట్లే?, పాతబస్తీలో ఖాజీ రఫియా లీలలు

భవానీ నగర్ పరిధిలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ వివాహ తంతుకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అడిషనల్‌ డీసీపీ మహ్మద్‌ గౌస్‌ మొహియుద్దీన్‌, చార్మినార్‌, సంతోష్‌నగర్‌ ఏసీపీలు ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.

 శారీరకంగా హింసించి:

శారీరకంగా హింసించి:

పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బహరైన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు దారబ్‌జంగ్‌ కాలనీకి చెందిన మహిళను శారీరకంగా హింసించారని తెలిసింది. హైదరాబాద్ లో తమకు మరో మహిళతో వివాహం జరిపిస్తేనే నిన్ను విడిచిపెడుతామని ఆమెను బెదిరించారు. అంతేకాదు, డబ్బు కూడా ఇస్తాని ఆశచూపారు.

 వలపన్ని పట్టుకున్న పోలీసులు

వలపన్ని పట్టుకున్న పోలీసులు

అరబ్ షేక్‌ల బెదిరింపులతో తలాబ్‌కట్టకు చెందిన ఓ అమ్మాయిని, ఆమె తల్లిదండ్రులను దారబ్ జంగ్ కాలనీకి చెందిన మహిళ పెళ్లికి ఒప్పించినట్టు తెలుస్తోంది. ఆమెతో బహరైన్ కు చెందిన షేక్ కు రహస్యంగా వివాహం జరిపిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇద్దరు బహరైన్‌ దేశస్థులు, ఖాజీ, ఫ్లాట్‌ యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరో కేసులో మైనర్ బాలికకు అరబ్ షేక్ కు అక్రమంగా వివాహం జరిపించిన నలుగురు బ్రోకర్లు, ఖాజీ, లాడ్జి నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయి మైనర్ అయినా తప్పుడు బయోడేటా పత్రాలు, నకిలీ ఆధార్ కార్డులతో ఆమె మేజర్ అని చూపించినట్టు తేలింది.

 64ఏళ్ల షేక్‌తో 14ఏళ్ల బాలిక వివాహం..

64ఏళ్ల షేక్‌తో 14ఏళ్ల బాలిక వివాహం..

రూ.1లక్ష ఒప్పందంతో ఒమన్ కు చెందిన సగారూన్‌ సలీం అబ్దుల్లా(64)తో నాంపల్లిలోని ఓ లాడ్జిలో కామాటిపురాకు చెందిన 14 సంవత్సరాల బాలికకు అక్టోబర్29, 2014లో వివాహం చేశారు. పెళ్లి అనంతరం బాలికను షేక్ ఒమన్ తీసుకెళ్లాడు. అక్కడికెళ్లాక బాలికను హింసించడం మొదలుపెట్టడంతో.. ఆమె తల్లికి విషయం చెప్పింది. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటపడింది.

అరెస్టు.. కఠిన చర్యలు

అరెస్టు.. కఠిన చర్యలు

బ్రోకర్లు ఫతే బిన్‌ మహమూద్‌, నాసర్‌ బిన్‌ మహమూద్‌, బిపాషా, రషీద్‌బీ, ఖాజీ సిద్దిఖ్‌ అహ్మద్‌, సల్మాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరబ్‌షేక్‌లకు అక్రమ వివాహం జరిపించినా.. వారికి ఆశ్రయం కల్పించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. మైనర్ బాలికను నకిలీ ధ్రువ పత్రాలతో మేజర్ గా చూపించినవారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయన్నారు. పాతబస్తీలో ఇప్పటికే 48మంది బ్రోకర్లను గుర్తించి వారిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేసి, జియో టాకింగ్ చేసినట్టు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad police busted another contract marriage of an Arab Sheikh with old city girl

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి