అంతా ఒక్కటై.. కాల్ మనీలో షాకింగ్: వేశ్యావృత్తిలోకి!

విజయవాడ: కాల్ మనీ వ్యవహారం సంచలనం రేపుతోంది. కాల్ మనీ వ్యవహారంలో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న స్వయంగా చెప్పారు. అయితే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు లేరని ఆయన స్పష్టం చేశారు.

విస్తుపోయే నిజాలు

కాల్ మనీ వ్యవహారంలో తవ్వేకొద్ది విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు, వారి బంధువులు కూడా ఉన్నారు. బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై బుద్ధా వెంకన్న స్పందిస్తూ... తన సోదరుడిని అరెస్టు చేసుకోవచ్చన్నారు.

ఈ వ్యవహారంలో ఎన్నో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రసాద్, చెన్నుపాటి శ్రీను, దూడల రాజేష్, యమలమంచిలి రాము, వెనిగళ్ల శ్రీకాంత్, సత్యానందం తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీలకు చెందిన వారు పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది.

AP Police bust call money racket

ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. నిందితుల్లో శ్రీను, సత్యానందం ఒడిశా పారిపోయారని, శ్రీకాంత్ బ్యాంకాక్ నుంచి మరో దాశానికి పారిపోయాడని తెలుస్తోంది. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. కాల్ మనీ బాధితుల్లో స్వయానా ఓ మంత్రి కూడా ఉన్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.

నిందితులు బాధితులకు రూ.5 నుంచి రూ.35 వరకు వడ్డీకి ఇస్తున్నారు. ఒక్కొక్కరు రూపాయలు వందల కోట్లు సంపాదించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో షాకింగ్ ఏమంటే కాల్ మనీ కేసులో ఓ పోలీస్ అధికారి కూడా రూ.2 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది.

కాల్ మనీ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు వివిధ పార్టీల వారు ఉన్నారని తెలుస్తోందని చెబుతున్నారు. మోహన్ అనే వ్యక్తి ఓ మహిళకు రూ.రెండున్నర లక్షలు ఇచ్చాడు. ఆమె కట్టలేకపోవడంతో తన వద్దకు రమ్మనడంతో పాటు... వేశ్యావృత్తిలోకి దించాలని కూడా హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

కాగా, కాల్ మనీ కేసులో పోలీసులు పది మందికి పైగా అరెస్టు చేశారు. ఆదివారం మరో నలుగురిని అరెస్టు చేశారు. కాల్ మనీ నిందితుడు రాము సహా ఏడుగురి పైన పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. కాల్ మనీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+