మనవరాలి పెళ్లి: మోడీ గిఫ్ట్‌తో షరీఫ్ సందడి (పిక్చర్స్)
లాహోర్: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన మనవరాలి పెళ్లి వేడుకలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బహూకరించిన పింక్ టర్బన్‌తో ఆకట్టుకున్నారు. మోడీ శుక్రవారం పాకిస్తాన్‌లో అకస్మికంగా పర్యటించిన విషయం తెలిసిందే.

ఈ సంద్భంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ప్రధాని మోడీ రాజస్థానీ గులాబీ రంగు తలపాగా (టర్బన్)ను బహుమతిగా ఇచ్చారు. దీంతోనే షరీఫ్ తన మనవరాలి పెళ్లి వేడుకలో ఆకట్టుకున్నారు.
దీనిపై పాకిస్తాన్ అధికార వర్గాలు స్పందిస్తూ... మనవరాలి పెళ్లిలో మోడీ ఇచ్చిన తలపాగా ధఱించడం నవాజ్ షరీఫ్‌కు పొరుగుదేశం పట్ల ఉన్న నిబద్ధత తెలియజేయడమే కాదని, ఆ కానుకకు ఎంత విలువ ఇస్తున్నారో అర్థమవుతోందని పేర్కొన్నారు.

మర్యమ్ నవాజ్ కూతురు మెహ్రున్నీసాకు రహీల్ మునీర్‌తో వివాహం జరిగింది. రహీల్ మునీర్ ప్రముఖ పారిశ్రామికవేత్త చౌద్రీ మునీర్ తనయుడు. షరీఫ్ మనవరాలి పెళ్లి నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అధే సమయంలో రాజస్తానీ తలపాగా బహుమతిగా ఇచ్చారు.












Click it and Unblock the Notifications