ఫలితాలకు ముందే.. ఓటమిని అంగీకరించిన ప్రధాని అభ్యర్థి

Posted By:
Subscribe to Oneindia Telugu

సిడ్నీ: ఎన్నికల ఫలితాలు వెలువడకుండానే ఆస్ట్రేలియా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత బిల్‌ షార్టెన్‌ తన ఓటమిని అంగీకరించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నానని, మరోసారి ప్రధానిగా మాల్కమ్‌ టర్న్‌బుల్‌ ఎన్నికవుతారని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అటు కన్జర్వేటివ్‌ కూటమికి చెందిన ప్రధాని టర్న్‌బుల్‌కు, ఇటు లేబర్‌ పార్టీకి చెందిన షార్టెన్‌కు మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. ఈ లెక్కింపు రోజులుగా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేత షార్టెన్‌ ప్రకటన సంచలనంగా మారింది.

Australia's opposition Labor party concedes defeat to Turnbull's coalition in national poll

మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టర్న్‌బుల్‌ మరోసారి ప్రధానిగా కొనసాగుతారని చెప్పారు. ఒకటి, రెండు సీట్ల తేడాతోనైనా కన్జర్వేటివ్‌ కూటమే విజయం సాధిస్తుందన్నారు. తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు.

అయితే ప్రభుత్వానికి లేబర్ పార్టీ ఎప్పుడూ మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు. గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో కన్జర్వేటివ్‌ కూటమి 74 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందింది. 150సీట్లున్న పార్లమెంట్‌లో లేబర్ పార్టీకి 66 సీట్లు వచ్చాయి. కన్జర్వేటివ్‌ కూటమి గెలుపొందాలంటే మరో రెండు సీట్లు సాధించాల్సి ఉంది. మిగిలిన 10 స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Australia's opposition Labor party concedes defeat to Turnbull's coalition in national poll

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి