వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణ డిమాండ్: తలపట్టుకుంటున్న చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు కుటుంబ సమస్య తప్పేలా కనిపించడం లేదు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణల తర్వాత ఇప్పుడు బావమరిది, హీరో నందమూరి బాలకృష్ణ సమస్య చంద్రబాబును ఇబ్బందులకు గురి చేస్తోందని అంటున్నారు. బాబుకు ఎన్టీఆర్ కుటుంబం నుండి తలనొప్పులు వరుసగా వస్తున్నాయి.

బాలకృష్ణ తాజాగా ముందుకు తెచ్చిన డిమాండ్లతో చంద్రబాబుకు కొత్త తలనొప్పి మొదలయిందంటున్నారు. తనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారట. అది సాధ్యం కాని పక్షంలో సీమాంధ్ర రాష్ట్రానికి వేసే కమిటీకి తనను అధ్యక్షుడిగానైనా చేయాలని పట్టుబడుతున్నారట. ఈ విషయాన్ని బాలయ్య నేరుగా బావకే చెప్పారట. అయితే, ఇప్పటి వరకు చంద్రబాబు దీనిపై ఓ నిర్ణయం తీసుకోలేదు.

తాను ప్రతిపాదించిన అంశాలపై చంద్రబాబు మౌనంగా ఉండటాన్ని బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారట. ఆయన ఒకింత ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. కొద్ది రోజుల క్రితం బాలయ్య అభిమాన సంఘం నేత ఒకరు విశాఖలో ఒక సమావేశం నిర్వహించి.. బాలయ్యకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శలు చేశారు. ఏలూరులో ఓ అభిమాని ధర్నా కూడా నిర్వహించారు. దీనిపై చంద్రబాబు కూడా అసంతృప్తిగా ఉన్నారట.

బాలయ్యకు టిక్కెట్

బాలయ్యకు టిక్కెట్

కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... బాలయ్య ఎక్కడ పోటీ చేయాలనుకొంటే అక్కడ టికెట్ ఇస్తామన్నారు. అయితే, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై మాట్లాడలేదు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆ ప్రకటన తర్వాత కూడా బాలకృష్ణ తనకు ఏ సీటు కావాలో చెప్పలేదు. పార్టీ అధ్యక్ష పదవి వ్యవహారం తేలిస్తేనే, తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది చెబుతానన్న ధోరణిలో బాలయ్య ఉన్నారట.

బాలకృష్ణ

బాలకృష్ణ

అయితే, ఒకే కుటుంబంలోని వారికి అన్ని పదవులు ఏమిటని పార్టీ క్యాడర్ గుసగుసలాడుతోందంటున్నారు. బాబుకు అధ్యక్ష పదవి ఉందని, అదే కుటుంబంలోని బాలయ్యకు మరో పదవి ఇస్తే ఎలా అని లోలోన చర్చించుకుంటున్నారట.

జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్

తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయ వారసునిగా ప్రకటించాలన్న కోర్కెతో కొంత కాలం క్రితం బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ అంతర్గతంగా చంద్రబాబుపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. దానిని పట్టించుకోలేదని అలిగి హరికృష్ణ పార్టీకి దూరంగా ఉండటం మొదలు పెట్టారు. ఆ వివాదంతో జూనియర్ కూడా పార్టీకి దూరంగా జరిగారు.

నందమూరి

నందమూరి

ఇప్పుడు అదే కోణంలో బాలకృష్ణ నుంచి ఒత్తిడి మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలేవీ ఇంతవరకూ ఎక్కడా బహిర్గతం కాలేదు. నందమూరి, నారా కుటుంబాల మధ్య అంతర్గత చర్చలకే పరిమితమయ్యాయంటున్నారు.

లక్ష్మీ పార్వతి

లక్ష్మీ పార్వతి

చంద్రబాబుకు ఎప్పటికప్పుడు కొత్త తలనొప్పులు వచ్చి చుట్టుకుంటున్నాయని సీనియర్లు వాపోతున్నారు. గతంలో హరికృష్ణ, లక్ష్మీ పార్వతిలు పార్టీ పెట్టినప్పటికీ అంతగా ప్రభావం చూపలేదు.

English summary
It is said that Telugudesam Party chief Nara Chandrababu Naidu is unhappy with Balakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X