వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం: త్వరలో డ్రైవర్ లేని తొలి 'భారత కారు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: త్వరలో భారతీయ రోడ్లపై తొలి డ్రైవర్ లేని కారు రాబోతుందా? అవును. బెంగుళూరుకు చెందిన ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇందుకు శ్రీకారం చుట్టారు. ఒకరోజు ట్యాక్సీలో రోషీ జాన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బెంగుళూరు ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళుతున్నారు. డ్రైవర్ మెల్లగా నిద్రమత్తులోకి జారుకోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టేంత పనైంది.

ప్రాణాలను కబలించబోయిన ఆ క్షణం... జాన్‌ను ఆలోచింపజేసింది. డ్రైవర్ లేని తొలి కారును తయారు చేసే దిశగా అడుగులు వేయించింది. అనుకున్నదే తడువుగా తన ఆలోచనను స్నేహితుల్ని పంచుకోవడంతో డ్రైవర్ లేని కారును రూపొందించారు. తన 29 మంది మిత్ర బృందంతో కలిసి 'టాటా నానో అటానమస్‌' అనే డ్రైవర్‌ లేని కారును తయారు చేశారు.

జాన్ టీసీఎస్‌లో రోబోటిక్స్‌ అండ్‌ కాగ్నెటివ్‌ సిస్టమ్స్‌ విభాగంలో పనిచేసే రోజుల్లో 2011లో టాటా నానో కారు కొని దాంట్లోనే తాను అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగించారు. ఐదేళ్లపాటు తన స్నేహితులతో కలిసి ఖాళీ సమయంలో దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌, 3డీ మోడల్‌ అల్గారిథమ్స్‌ని తయారు చేసి పరీక్షించి చూశారు.

Bangalore engineer found indian car without driver

2012 మేలో తొలిసారిగా బెంగళూరు రోడ్లపై ఆ కారును పరీక్షించారు. ఇప్పుడు రోడ్లపై ఆ కారు పనితీరును తెలుసుకునేందుకు ట్రాఫిక్‌ పోలీసుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు ఈ డ్రైవర్ లేని కారు తయారీకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు.

ఈ డ్రైవర్ లేని కారు కోసం ప్రస్తుతం అన్ని కార్ల మాదిరే ఆన్‌బోర్డ్‌ డయాగ్నస్టిక్స్‌నే ఉపయోగించినట్లు జాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాన్ మాట్లాడుతూ ''ఆర్‌పీఎం ఆధారంగా కారును నడిపేలా కారు డేటాను సేకరించాం'' అని చెప్పారు. అన్ని రకాల కంప్యూటర్లను ఉపయోగించడం ద్వారా కారు డేటాను చదివేలా 3డీ మోడల్‌ అల్గారిథమ్స్‌ రూపొందించామని చెప్పారు.

ఈ డ్రైవర్ లేని కారు ఎంత వేగంతో వెళుతుందో తెలుసుకునేందుకు కారులో వీల్‌ ఎన్‌కోడర్స్‌ (చక్రాలను అంచనా వేసే పరికరాలు), కారు చుట్టుపక్కల ఉన్న ఆటంకాలను గుర్తించేందుకు మల్టిపుల్‌ లైడార్స్‌, హెచ్‌డీఆర్‌ కెమెరాలు, జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.

ఒక మనిషి ఎలాగైతే కారుని నడుపుతాడో, అదే విధంగా 'టాటా నానో అటానమస్‌' లో సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి పరీక్షించామని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కోటి రూపాయలు ఖర్చు చేశామని జాన్ తెలిపారు. కాగా జాన్ రూపొందించిన ఆ టెక్నాలజీ కోసం పలు వాహన సంస్ధలు భారీ ఆఫర్లను ప్రకటించాయి.

అయితే వాటన్నింటినీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. 'టాటా నానో అటానమస్‌'‌ను తయారు చేసేందుకు గాను జాన్ బృందానికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. విదేశాల నుంచి స్కానర్లను దిగుమతి చేసుకునేందుకు కస్టమ్స్‌ కమిషనర్‌కు జాన్‌ మూడు పేజీల వివరణ పత్రం సమర్పించారు.

English summary
Bangalore engineer found indian car without driver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X