భూమా చేరికపై హైడ్రామా: నెలాఖరులోగా జగన్‌కు 10మంది షాక్!
కర్నూలు/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియలు తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. భూమాను బుజ్జగించేందుకు వైసిపి అధినేత జగన్, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రంగంలోకి దిగారు.
అయినప్పటికీ ఇంకా సమస్య కొలిక్కి రాలేదని తెలుస్తోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ టిడిపిలో ఎప్పుడైనా చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబును భూమా ఆదివారం కలుసుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్: ఒక దెబ్బకు రెండు పిట్టలు, ఎలా?
మరోవైపు, వైయస్ జగన్, విజయమ్మ, ఇతర వైసిపి నేతలు భూమాను ఆపేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే భూమా టిడిపిలోకి వస్తే మంత్రి పదవి ఖాయమైందని, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఆయన రావొచ్చునని అంటున్నారు.

నెలాఖరులోగా 10మంది జంప్?
ఫిబ్రవరి నెలాఖరులోగా పదిమంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి జంప్ చేయవచ్చుననే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు శనివారం కర్నూలు జిల్లాకు చెందిన నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. టిడిపిలోకి వలసలు పెంచాలని వారు నిర్ణయించారని తెలుస్తోంది.
ఇది వైసిపి శిబిరంలో కలవరం రేపుతోందని అంటున్నారు. ఓ సమయంలో బొత్స సత్యనారాయణ, సుజయ్ కృష్ణ రంగారావులు టిడిపిలోకి రావాలని ప్రయత్నించారని, వారి విషయంలో టిడిపి ఆచితూచి స్పందించిందని, ఇప్పుడు మాత్రం చేరికల పైన జోరుగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: జగన్‌కు ప్రకటన ముప్పు: చంద్రబాబు తలుచుకంటే వైసిపి ఖాళీ?
శనివారం చంద్రబాబు మాట్లాడుతూ... ఇతర పార్టీల్లో ఉన్న సమర్థులు, మంచివారు వస్తే చేయి కలుపుతామని వ్యాఖ్యానించారు. కష్టాలను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకెళుతున్నామని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిపథానికి తీసుకెళ్లాలంటే అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.
విభజన సమయంలో సమన్యాయం పాటించమని నాటి పాలకుల్ని కోరినా వినిపించుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించారన్నారు. సమస్యల్ని దాటుకుని సాగుతుంటే ఇంకా బతికి ఉన్నారా? అని చూసేందుకు కొందరు నాయకులు వస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌పై విమర్శలు చేశారు.
అలాంటివారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో కాంగ్రెస్ భూస్థాపితం కావటం ఖాయమన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన పలువురు వైసిపి సర్పంచులు శనివారం టిడిపిలో చేరిన సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు.
రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే ప్రతిపక్ష వైకాపా అడ్డుపడుతోందని, పట్టిసీమను, నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తోందని విమర్శించారు. కొందరు కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాయలసీమను రతనాలసీమగా మార్చుతామన్న హామీకి కట్టుబడి ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications