Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నువ్వెంత?: కేసీఆర్-బాబు మాటకు మాట (పిక్చర్స్)

హైదరాబాద్/అమరావతి: ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావులు సోమవారం నాడు ఒకరి పైన మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు.

చంద్రబాబు ఒకటి అంటే, కేసీఆర్ రెండు, కేసీఆర్ ఒకటి అంటే చంద్రబాబు రెండు అన్నట్లుగా మాటకుమాట పేల్చుకున్నారు.

మంగళగిరిలో జరిగిన మహాసంకల్పంలో ఏపీ సీఎం తెలంగాణ సీఎం పైన నిప్పులు గక్కారు. ప్రతిగా నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రతి విమర్శలు చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

'హైదరాబాద్ నీ జాగీరు కాదు. పదేళ్ల ఉమ్మడి రాజధాని. అక్కడ నీకెంతుందో నాకూ అంతే హక్కుంది. ఏసీబీ, పోలీసులు నాకూ హైదరాబాద్‌లో ఉన్నారు. మంచిగా ఉంటే మంచిగా ఉంటా. చెడు తలపెడితే అంతుచూస్తా. ఖబడ్దార్'అంటూ చంద్రబాబు మంగళగిరి మహా సంకల్పంలో హెచ్చరించారు.

కేసీఆర్

కేసీఆర్

తస్మాత్ జాగ్రత్త... నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడని చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన హెచ్చరించారు. అడ్డదారిలో ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా పట్టపగలే దొంగలా దొరికి కూడా తనను అన్యాయంగా ఏసీబీ కేసులో ఇరికించారంటూ చంద్రబాబు బుకాయిస్తున్నాడని కేసీఆర్ ధ్వజమెత్తారు.

చంద్రబాబు

చంద్రబాబు

సుమారు గంటకుపైగా మాట్లాడిన చంద్రబాబు చివరి పది నిమిషాల్లో తెలంగాణ ప్రభుత్వం, కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. పది నిమిషాలు ఆవేశంతో ఊగిపోయారు. రాష్ట్రం విడివడిన తర్వాత, అంతకుముందు చంద్రబాబు ఈ స్థాయిలో మాట్లాడిన దాఖలాలు లేవు.

చంద్రబాబు

చంద్రబాబు

స్ట్రింగ్ ఆపరేషన్లు, ఫోన్లు ట్యాప్ చేయడం నీతిబాహ్యమైన చర్య, నీచాతినీచం. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం కెసిఆర్‌కు ఎవరిచ్చారంటూ చంద్రబాబు ఊగిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో మీకు ఎంతుందో, మాకూ అంతే అధికారం ఉందని, సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో ఉంటాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ గడ్డపై ఏపీ సీఎం కిరికిరి చెల్లబోదన్నారు. నల్గొండలో జరిగిన తెలంగాణ ప్రగతిపథం బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఉమ్మడి రాజధానిలో పాలన సాగిస్తున్న ఏపి సీఎం చంద్రబాబు రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్లుగా వ్యవహరిస్తున్నాడన్నారు. హైద్రాబాద్‌పై నీకెంత హక్కుందో నాకూ అంతే హక్కు ఉందంటూ చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని హైద్రాబాద్ నీ అబ్బ జాగీర్ కాదు.. ఇక్కడ తెలంగాణ సీఎం పాలనలోని ప్రజల సొత్తు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

మా ఎమ్మెల్యేని ఫామ్‌హౌస్‌కి తీసుకెళ్లి డబ్బులిచ్చి పోలీస్ సెక్యూరిటీతో జాగ్రత్తగా ఇంటికి పంపించారని, ఇది నీతిమాలిన చర్య కాదా? అని ప్రశ్నించారు. తమ పార్టీ తరపున గెలిచిన శ్రీనివాస యాదవ్‌ను సిగ్గులేకుండా మీ ప్రభుత్వంలో ఏవిధంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారని నిలదీశారు. తనకు ఎమ్మెల్సీ ముఖ్యం కాదని, సిద్ధాంతం, నీతి, నిజాయితీలే ముఖ్యమన్నారు.

కేసీఆర్

కేసీఆర్

చంద్రబాబును ఎవరు కేసులో ఇరికిస్తారని, ఎందుకు ఇరికిస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. పట్టపగలు దొంగతనం చేసిన పట్టబడ్డాడని ఆయన అన్నారు. దొంగ పనులు చేసివాడిని దొంగ అనకపోతే ఏమంటారని ఆయన అడిగారు. అయినా చంద్రబాబు ఇరికిస్తే ఇరికే వాడేనా అని, ఇతరులను ఇరికించేవాడని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్ల ఇళ్లు కూల్చేస్తున్నారని, దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని, తన ప్రజల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడతానని బాబు ఉద్వేగంగా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాల్పడుతున్న అవమానకర చర్యలు 5కోట్ల ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఏసీబీకి దొంగలా దొరికి బండారం బట్టబయలైనా అన్యాయంగా ఇరికించారంటూ పెడబొబ్బలు పెడుతూ గాయి చేస్తూ లుచ్చా లత్కోర్ చేతలు చేస్తున్న చంద్రబాబు నీచ చరిత్ర ఇవాళ దేశమంతా తెలిసిపోయిందని, తెలంగాణ సమాజం తగిన శాస్తి చేస్తుందంటూ దుయ్యబట్టారు.

చంద్రబాబు

చంద్రబాబు

నాడు ఎన్టీఆర్‌ను ఇందిరాగాంధీ అన్యాయంగా కూలదోసిందని, తర్వాత ఏమైందో గుర్తుకు తెచ్చుకోవాలని, తాను తెరాస ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై హైదరాబాద్‌లో బతకడం లేదని, తనకు ప్రజలే హైకమాండ్ అన్నారు. పదేళ్లపాటు అక్కడ నీకెంత ఉందో నాకూ అంతే ఉందన్నారు.

కేసీఆర్

కేసీఆర్

హైద్రాబాద్ డీజీపీ తెలంగాణ సీఎం పరిధిలో ఉంటాడన్న చంద్రబాబు మాటలు ఇక్కడ చెల్లవన్నారు. రాష్ట్ర అభివృద్ధికి 18 గంటలు పనిచేస్తూ ఆహర్నిశలూ శ్రమిస్తున్న తమకు చంద్రబాబును కేసులో ఇరికించేంత సమయం లేదన్నారు. ఆంధ్ర గుంట నక్క చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన విద్యుత్ రాకుండా చేసి తెలంగాణ టీడీపీ నేతలతో బస్సుయాత్రలు చేయించినా గుండె ధైర్యంతో తెలంగాణ విద్యుత్ సమస్యలను అధిగమించి కోతలు లేకుండా చూశామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

నేను కన్ను తెరిస్తే ఇబ్బందిపడతావ్ అంటూ కేసీఆర్‌ను చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. తన ఫోన్ ట్యాప్ చేసి టి-చానల్‌లో వేసే అధికారం ఎవరిచ్చారని, ఇది తీవ్రమైన నేరమని, ద్రోహమని, సమయం వచ్చినపుడు అస్త్రాలు బయటకు తీస్తానంటూ వ్యాఖ్యానించారు. ఏడాది పూర్తయిన సందర్భంగా మీరు సంబరాలు చేసుకున్నారని,మేము సంకల్ప సభ పెట్టుకుంటే చెడగొట్టాలని కుట్రపన్నారని, బుద్ధి ఉన్నవారెవరైనా శుభకార్యానికి అడ్డుపడతారా? అని దుయ్యబట్టారు.

కేసీఆర్

కేసీఆర్

చంద్రబాబు తన కొంపను తానే కూల్చుకున్నాడని ఆయన అన్నారు. చంద్రబాబు కొంపలు కాల్చే రకమేకానీ తన కొంప కాల్చుకునే వాడు కాదన్నారు. పక్క రాష్ట్రం నేతలు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలను కొని గెలిపించుకుంటామంటే చేతులు ముడుచుకు కూర్చోవాలా? అని మండిపడ్డారు.

చంద్రబాబు

చంద్రబాబు

తాను ప్రభుత్వాధినేతనని, మాకు స్వయం ప్రతిపత్తి ఉందని, తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్.. ఎవరినీ వదిలిపెట్టనంటూ హెచ్చరించారు. 30ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికానని, అసమర్థ కేసీఆర్ నేను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రపన్నుతున్నాడన్నారు. పనిలోపనిగా జగన్‌పైనా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇక్కడొక మహానాయకుడు ఉన్నాడని, ఆయనపై 16 అవినీతి కేసులున్నాయని, సిగ్గులేకుండా నాపై విమర్శలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

కేసీఆర్

కేసీఆర్

"నీ సంగతంతా ఫోన్ మాటల్లో బయటపడింద"న్నారు. "పట్టపగలు దొరికిన దొంగవు నీవు చంద్రబాబు, ఎక్కువ మాట్లాడితే నీకు ఏ శాస్తి జరగాలో అది జరుగుతుంది" అని కేసీఆర్ హెచ్చరించారు. రాజకీయాలను చంద్రబాబు భ్రష్టు పట్టించారన్నారు. "నీ ఎమ్మెల్యే జైలులో ఉన్నాడు, నీ బతుకే బయటపడుతుంది" అని చంద్రబాబును ఉద్దేశించి కెసిఆర్ అన్నారు. "నీకు ఎసిబి ఉన్నా నీలా కెసిఆర్ దొంగ కాడు" అని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+