• search
For hyderabad Updates
Allow Notification  

  'డేంజర్ స్పాట్'లో అరగంట: చాందిని హత్యలో నిగ్గు తేలినవి ఇవే!, నిందితుడు ఏం చెప్పాడంటే?

  |
   Chandini Jain mysterious case finally been cracked చాందిని హత్యలో నిగ్గు తేలినవి ఇవే! | Oneindia

   హైదరాబాద్: అమీన్‌పూర్ గుట్టల్లో హత్యకు గురైన చాందిని జైన్ హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రియుడే ఈ హత్యకు పాల్పడ్డాడని తేలింది. అయితే వీరిద్దరి మధ్య స్నేహానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

   అతనే చంపేశాడు?: వీడిన చాందిని జైన్ హత్య మిస్టరీ, ఆ ఫుటేజీ కీలకం..

   దాదాపు ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉందనేది ఒక వాదనైతే.. వారం, పది రోజుల క్రితమే సాయికిరణ్ రెడ్డితో పరిచయం ఏర్పడిందనేది మరో వాదన. మరోవైపు నిందితుడు చాందిని స్కూల్ మేట్ అన్న వాదన కూడా ఉంది. దీంతో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడిస్తే కానీ దీనిపై స్పష్టత వచ్చేలా లేదు.

   డేంజర్ స్పాట్‌లో అరగంట:

   డేంజర్ స్పాట్‌లో అరగంట:

   చాందిని హత్యకు గురైన అమీన్ పూర్ గుట్టల ప్రాంతం నిర్జన ప్రదేశం. అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఈ ప్రాంతంలో పోకిరీలు, మందుబాబులు తప్పితే వేరెవాళ్లు అటువైపు వెళ్లడానికి సాహసించరు. కానీ ప్రియుడి మీద ఉన్న నమ్మకంతో అతనితో కలిసి చాందిని ఆ గుట్టల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే ఇద్దరు అరగంటకు పైగా గడిపినట్టు ఆధారాలు లభించాయి. ఆమె మృతదేహాం లభ్యమైనప్పుడు తొలుత ఆత్మహత్య అని భావించినప్పటికీ.. ఆమె సెల్ ఫోన్ డేటా ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో అసలు నిజాలు వెలుగు చూశాయి.

   చాందిని కుటంబ నేపథ్యం:

   చాందిని కుటంబ నేపథ్యం:

   చాందిని తండ్రి కిషోర్ జైన్ ఒక వస్త్ర వ్యాపారి. వ్యాపార పనుల నిమిత్తం ఆయన పలు పర్యటనల్లో ఉన్నారు. మదీనాగూడాలో ఉన్న ఆయన ఇంట్లో భార్య, ఇద్దరు కుమార్తెలు ఉంటున్నారు.చాందిని స్థానిక సిల్వర్‌ ఓక్‌ ఇంటర్నేషనల్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఎప్పుడూ అందరితో కలివిడిగా ఉండే చాందిని ఈనెల 9వ తేదీన అదృశ్యమైంది. మియాపూర్‌ పోలీసులు కిడ్నాప్‌ కింద కేసు నమోదు చేశారు. సంగారెడ్డి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. అమీన్ పూర్ గుట్టల్లో ఆమె మృతదేహం లభ్యమైంది.

   పదిరోజుల పరిచయంలోనే:

   పదిరోజుల పరిచయంలోనే:

   చాందినికి అబ్బాయిలతో పెద్దగా పరిచయాలు లేవని చెబుతున్నారు. నిందితుడితో కేవలం పది రోజుల క్రితమే పరిచయం ఏర్పడినట్లుగా భావిస్తున్నారు. పది రోజుల క్రితం తల్లితో కలిసి దాండియా నృత్యంలో పాల్గొనేందుకు సెంట్రల్‌ హోటల్‌కు చాందిని వెళ్లింది. అక్కడే నిందితుడితో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు, తరుచు కలవడం వంటివి జరిగాయి.

   తన మొబైల్ ఫోన్‌లో 'మై హార్ట్' అనే పేరుతో ప్రియుడి టాక్ట్ ఉండటం బట్టి వీరిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అర్థమవుతోంది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ మిస్సింగ్ కు రెండు రోజుల ముందు వరకు ఆమె ముభావంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనిపై సోదరి నివేదిత చాందినిని నిలదీయగా.. ఆమె దాటవేత ధోరణితో వ్యవహరించినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితమే వీరి మధ్య గొడవ జరిగి హత్యకు దారి తీసిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

   ఆరోజే హత్య జరిగిందా?:

   ఆరోజే హత్య జరిగిందా?:

   ఈనెల 9న కాలేజీ నుంచి తిరిగి వచ్చాక సాయంత్రం మూడున్నర ప్రాంతంలో చాందిని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్తున్నట్లు చెప్పింది. అంతకుముందు సత్యనారాయణ ఎంక్లేవ్‌ అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ వద్ద ఉన్న దాండియా శిక్షణ కేంద్రం వద్ద తల్లి కవితా జైన్, సోదరి నివేదితలతో కొద్దిసేపు గడిపింది. బయటికెళ్లాక సాయంత్రం 6గం. నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్. చాందిని మృతదేహం పడి ఉన్నతీరు, మృతదేహం పాక్షికంగా కుళ్లిపోయి ఉండటాన్ని బట్టి 9వ తేదీనే ఆమె హత్యకు గురైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

   దుస్తులపై రక్తపు మరకలు:

   దుస్తులపై రక్తపు మరకలు:

   చాందిని జైన్‌ను హత్యచేసిన చేసిన ప్రియుడి ఇంట్లో రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మదీనాగూడలోని ఓ అపార్టుమెంట్ లో ఉన్న నిందితుడి ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. రక్తపు మరకలు ఉన్న దుస్తులు దొరికాయి.

   నిందితుడు ఏం చెప్పాడు?:

   నిందితుడు ఏం చెప్పాడు?:

   ఇంటర్ చదువుతున్న చాందినికి సాయికిరణ్ రెడ్డితో ఆరేళ్లుగా పరిచయం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలిసినవాడు కావడంతోనే అతన్ని నమ్మి అమీన్‌పూర్ గుట్టల్లోకి వెళ్లింది. అక్కడే ఇద్దరు అరగంటకు పైగా గడిపినట్టు ఆధారాలు లభించాయి. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సాయికిరణ్ పోలీసులకు తెలిపాడు. అనంతరం చాందినిని హత్య చేశానని, ఆమె సెల్‌ఫోన్‌ను చెరువులో పడేశానని సాయికిరణ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.

   కాగా, చాందినిని హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. స్నేహం మాటున అమ్మాయిని అంతం చేసిన హంతకుడిని శిక్షించాలని కోరుతున్నారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   మరిన్ని హైదరాబాద్ వార్తలుView All

   English summary
   The mysterious murder of Intermediate first year student Chandini Jain has finally been cracked.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more