టిపై, జగన్‌పై బాబుకు క్లారిటీ: లోకేష్ సైలెంట్ ఎంట్రీ!

అదే సమయంలో ఈ సదస్సును బాబు తన తనయుడు నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశానికి వేదికగా ఉపయోగించుకున్నారు. ఒకవిధంగా వ్యూహాత్మకంగా తీసుకు వచ్చారని అంటున్నారు. సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల సీనియర్ నాయకులకు లోకేశ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్స్ ద్వారా ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి చెప్పారు. బాబు ప్రారంభ ఉపన్యాసం, ముగింపు ఉపన్యాసానికి మాత్రమే మీడియాను అనుమతించారు.
నారా లోకేశ్ ఉపన్యాసాన్ని మీడియాలో లైవ్‌గా ప్రసారం అయ్యేట్టు చేస్తే బాగుంటుందని కొందరు నాయకులు పార్టీ నాయకత్వానికి సూచించారు. అయితే పార్టీ సీనియర్లకు లోకేశ్ పరిచయ కార్యక్రమంగానే ఉంటే బాగుంటుందని, మొదటి ఉపన్యాసానికే అధిక ప్రచారం సరికాదని పార్టీ నాయకత్వం భావించారట. బాబు పాదయాత్ర ముగింపు బహిరంగ సభలోనే లోకేశ్‌ను పరిచయం చేయాలని భావించినట్లుగా వార్తలు వచ్చాయి.
వారసత్వం విషయంలో నందమూరి హరికృష్ణ వివాదం వల్ల అది వాయిదా పడిందంటారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లోకేశ్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడానికి మేధోమథన సదస్సును ఉపయోగించుకున్నారు. 2009 ఎన్నికల్లో టీవిల్లో టిడిపి ప్రచార ప్రకటనల బాధ్యతలు చేపట్టిన లోకేశ్ ఈసారి మాత్రం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి యువతకు చేరువ కావాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. లోకేష్ నాలుగు రోజుల క్రితం టిడిపి సీనియర్ నేతల తనయులకు ఓ హోటల్లో విందు ఇచ్చి రాజకీయ అంశాలపై ముచ్చటించారు.
కాగా, బాబు ఒకవైపు రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూనే మరోవైపు విభజన అనివార్యం అనే సందేశాన్ని పార్టీ శ్రేణులకు ఇచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికే మూడు నెలల కాలం గడిచిపోయిందని, ఎన్నికలకు ఇంకా వందరోజులు మాత్రమే ఉన్నందున అధికారంలోకి రావడానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రాంతంలో టిడిపి ఆశలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ సీమాంధ్రలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
విభజన ఒక కొలిక్కి వచ్చిన తరువాత పరిస్థితి మారుతుందని, ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో జగన్ హడావుడి చేస్తున్నా, విభజన తరువాత ఆయనకు అజెండా ఏమిటని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన బాబు కొత్త రాష్ట్రంలో అభివృద్ధికి అవకాశం కల్పించాలనే నినాదంతో టిడిపి జనంలోకి వెళుతుందని అన్నారు. కాంగ్రెస్ అవినీతి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు కుమ్మక్కు అయ్యాయనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications