బిజెపితో తాడోపేడో: చంద్రబాబు పెట్టిన డెడ్‌లైన్ ఇదీ...
Recommended Video

అమరావతి: తమ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో కూడా చంద్రబాబు అదే విషయం చెప్పినట్లు సమాచారం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వేచి చూద్దామని, ఈలోగా కేంద్రంపై ఒత్తిడి పెడుదామని చంద్రబాబు పార్టీ పార్లమెంటు సభ్యులకు చెప్పారు.

ఆ తర్వాత తీవ్రమైన నిర్ణయమే..
రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసే లోగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బిజెపితో తెగదెంపులు చేసుకోవడం తప్ప మరో మార్గం ఉండదని చంద్రబాబు పార్టీ నాయకులకు చెప్పారు.

సమస్యలు పరిష్కరించాల్సిందే...
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసే లోగా రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన ఆర్థిక అంశాలపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలు తీవ్రమైన ఆసంతృప్తితో ఉన్నారని, అందువల్ల సమస్యలు పరిష్కారం కాకున్నా బిజెపితో కలిసి నడవడంలో అర్థం ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు.

చంద్రబాబు అడుగుతున్నవి ఇవీ..
2014 - 15 ఆర్థిక సంవత్సరం లోటును భర్తీ చేయడానికి కేంద్రం 3,500 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయాలని, అమరావతి నిర్మాణం కోసం 4 వేల కోట్ల నుంచి 5 వేల కోట్ల రూపాయల వరకు ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు 4 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.

ఇలా కూడా చేయాలి...
ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా నాబార్డు నుంచి 16 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి కేంద్రం అనుమతించాలని కూడా చంద్రబాబు కోరుతున్నారు. నాబార్డు నుంచి 4 వేల కోట్ల రూపాయలు తీసుకోవడానికి మాత్రమే కేంద్రం ప్రస్తుతం అనుమతి ఇచ్చిందని అంటున్నారు. తమ డిమాండ్లపై కేంద్రం సానుకూల నిర్ణయం వెల్లడించకపోతే రాజకీయ నిర్ణయం తీసుకోక తప్పదని చంద్రబాబు తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం .

ఏమీ చేయకున్నా కొనసాగితే...
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం చేయకపోయినా బిజెపితో పొత్తు కొనసాగిస్తే దాని ఫలితాన్ని తాము కూడా అనుభవించాల్సి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. తెలుగుదేశం పట్ల ప్రజలు ఆగ్రహంతో లేరని, 85 శాతం మంది ప్రజలు టిడిపి ప్రభుత్వం తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయంపైనే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చంద్రబాబు అంటున్నారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..











Click it and Unblock the Notifications