చిరంజీవి లీడ్: కిరణ్‌పై మంత్రుల తిరుగుబాటు

ఈ సమావేశానికి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, సి. రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్, మహీధర్ రెడ్డి, ఎన్ రఘువీరా రెడ్డి, పి. బాలరాజు హాజరయ్యారు. వీరందరి తరఫున ఆనం రామనారాయణ రెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పరోక్షంగా ముఖ్యమంత్రి తీరును తప్పుపడుతూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. సిడబ్ల్యసి నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా చివరి వరకు సమైక్యాంధ్ర కోసం ఒత్తిడి తెస్తామని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ కాంగ్రెసు పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.
విభజన తీర్మానాన్ని ఓడించి ఆపై రాజీనామాలకు సమిష్టిగా ముందుకెళ్లాలని కిరణ్ కుమార్ రెడ్డివర్గానికి చెందినవారు భావిస్తుంటే మరోవర్గం మాత్రం సేవ్ కాం గ్రెస్ సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో పార్టీలోనే కొనసాగే యోచన చేస్తు న్నారు. మొత్తం మీద సమైక్యంపేరుతో సాగుతున్న భేటీలు ముఖ్యమంత్రి అనుకూల, వ్యతిరేక మంత్రులు వర్గాలుగా ఏర్పాటుకు దోహదప డ్డాయని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ హైక మాండ్‌ను దిక్కరించేలా ఉన్నాయని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది కాంగ్రెస్ నేతలేనని చర్చకు వచ్చినట్లు సమా చారం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించేలా ఉండాలే గానీ సమస్యను మరింత జఠిలం చేసే విధంగా ఉండకూడదని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
అన్ని పార్టీల అభిప్రాయం మేరకే తెలంగాణ ఏర్పాటు దిశగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, ఇది ప్రజలకు చెప్పకుండా ప్రతిపక్షాల ఆరోపణలపై మౌనం దాల్చితేనిండా మునుగుతామని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. కాగా, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే సీనియర్ మంత్రుల బృందం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రికి బాసటగా మరో వర్గం
ఇదిలావుంటే మరోవైపు మంత్రి గంటా శ్రీనివాస రావు నివాసంలో మంత్రి శైలజానాథ్, ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ తదితరులు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వారు సమర్థించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వారు అభిప్రాయపడ్డారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications