దూరంలో ఉన్నారు, వదిలేయండి!: పవన్‌కళ్యాణ్‌పై చిరంజీవి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి బుధవారం రాత్రి ముకుంద ఆడియో విడుదల కార్యక్రమంలో.. అభిమానులు తన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విషయమై అడిగినప్పుడు స్పందించారు. అభిమానులు ఆడియో లాంచ్‌కు రాని రామ్ చరణ్ తేజ గురించి, పవన్ గురించి అడిగారు.
రామ్ చరణ్ తేజ తన తల్లి వద్ద ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ఫ్యాన్స్ ఫవన్ అంటూ నినాదాలు చేశారు. దానికి చిరు స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో ఉన్నారని ఇంతకుముందే చెప్పారని (అంతకుముందు వరుణ్ తేజ చెప్పారు) గుర్తు చేశారు.

ఇప్పుడు పిలిచినా రాలేనంత దూరంలో ఉన్నాడని, వర్క్ పట్ల కమిట్‌మెంట్ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. మెగా అభిమానులు అదే పనిగా పవన్ కళ్యాణ్ గురించి నినాదాలు చేస్తుంటే.. లీవిట్ అంటూ ముకుంద సినిమా గురించి మాట్లాడారు.
కాగా, అంతకుముందు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, ముకుంద సినిమా హీరో వరుణ్ తేజ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో వివరణ ఇచ్చారు.
"బాబాయ్ పవన్ ఇక్కడకు రాలేదు కానీ ఆయన బ్లెస్సింగ్స్ నాతోనే ఉన్నాయి. ఆయన గోపాల గోపాల షూటింగ్‌లో వారణాసిలో బిజీగా ఉన్నారు. ఏదేమైనా నాకు ఆయన మెసేజ్ పంపి, శుభాకాంక్షలు తెలిపార"ని వరుణ్ తేజ అన్నారు.వరుణ్ హీరోగా వస్తున్న చిత్రం ముకుందా ఈ చిత్రం ఆడియో పంక్షన్ బుధవారం రాత్రి జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ వస్తాడని అందరూ భావించారు. అయితే ఆయన రాలేదు. ఈ విషయమై వివరణ ఇస్తూ వరుణ్ ఇలా స్పందించారు.












Click it and Unblock the Notifications