టిపై సోనియా కన్ను: జైపాల్, యాష్కీలకు కీలక పదవి
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో డి శ్రీనివాస్ వంటి సీనియర్లు పార్టీని వీడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలకు పెద్దపీట వేసే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. జైపాల్ రెడ్డికి సిడబ్ల్యూసి, మధుయాష్కీకి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి.
త్వరలో ఏఐసీసీలో భారీ మార్పులు జరగవచ్చునని అంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కీలక పదవులు లభించవచ్చునని అంటున్నారు. ఏఐసీసీలో తెలంగాణకు నాలుగు కీలక పదవులు లభించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి.

అందులో రెండు కార్యదర్శి పదవులు, ఒకటి వర్కింగ్ కమిటిలో చోటు, మరొకటి ప్రధాన కార్యదర్శి అంటున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న యాష్కీ పేరును ప్రధాన కార్యదర్శి పదవికి పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డికె అరుణ, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి వంటి నేతలు దూకుడుగా వ్యవహరిస్తుంటే, మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సునితా లక్ష్మా రెడ్డి, గీతా రెడ్డి, దామోదర వంటివారు పెద్దగా మాట్లాడటం చరచ్ సాగుతోంది.












Click it and Unblock the Notifications