మహాభిశంసన ట్రంప్‌కు గండమేనా?: అమెరికన్లు ఏమంటున్నారు!, జోరుగా బెట్టింగులు..

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: పరిస్థితులు చూస్తుంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కష్టాలు మొదలైనట్లుగానే కనిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఏకపక్ష వైఖరిపై రోజురోజుకు వ్యతిరేకత బలపడుతూనే ఉండటంతో.. మహాభిశంసన తీర్మానం ద్వారా ఆయన్ను గద్దె దించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పబ్లిక్ పోలింగ్(పీపీపీ) అనే ఓ ప్రైవేటు సంస్థ ఒక సర్వే నిర్వహించగా.. అత్యధికంగా 54శాతం మంది ట్రంప్ పాలన బాగాలేదని అభిప్రాయపడ్డారు. కేవలం 40శాతం మంది మాత్రమే ఆయన పాలన బాగుందన్నారు.ఇక మిగిలిన 6శాతం మంది తటస్థ వైఖరిని అవలంభించారు.

మహాభిశంసన తీర్మానంపై బెట్టింగులు:

మహాభిశంసన తీర్మానంపై బెట్టింగులు:

ఇదిలా ఉంటే, మహాభిశంసన తీర్మానంపై ఆన్ లైన్ లో విపరీతమైన బెట్టింగ్స్ జరుగుతుండటం గమనార్హం. ఆన్ లైన్ పొలిటికల్ ప్రెడిక్షన్ లో గత రెండు రోజులుగా.. ట్రంప్ పాలన కొనసాగుతుందా? మధ్యలో గద్దె దిగుతారా? అన్న అంశంపై చాలామంది బెట్టింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు లక్షకు పైచిలుకు మంది ఈ ప్రెడిక్షన్ లో పాల్గొన్నట్లు సమాచారం.

పెరుగుతోన్న వ్యతిరేకత:

పెరుగుతోన్న వ్యతిరేకత:

కాగా, గతవారం ట్రంప్ అభిశంసనకు గురై గద్దె దిగుతారని కేవలం 7శాతం మంది అభిప్రాయపడగా.. బుధవారం ఒక్కరోజే అది 33శాతానికి పెరిగడం గమనార్హం. సాయంత్రానికి మళ్లీ తగ్గి 24శాతానికి పెరిగింది. ఈ ప్రెడిక్ట్ ఇట్ ను వాషింగ్టన్ పొలిటికల్ కన్సల్టెన్సీ, అరిస్టోటిల్, విక్టోరియా యూనివర్సిటీ-వెల్లింగ్టన్ లు నిర్వహిస్తున్నాయి.

ఇందులో రిజిస్టర్ అయినవాళ్లంతా అమెరికన్లే. బెట్టింగ్ చేస్తున్న చాలామంది ట్రంప్ పూర్తి కాలంలో పదవిలో ఉండరని 5వేల డాలర్ల వరకు బెట్ చేసినట్లు బుక్ మేకర్ పాడీ పవర్ బెట్ ఫెయిర్ తెలిపింది.

బెడిసికొట్టిన నిర్ణయాలు:

బెడిసికొట్టిన నిర్ణయాలు:

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ట్రంప్ ఏకపక్ష వైఖరి కొనసాగింది. తనకు అనుకూలంగా వార్త కథనాలు రాయని మీడియా సంస్థలను నిషేధించారు. పలు సందర్భాల్లో మీడియాపై విమర్శలు కూడా చేశారు. ఈ వ్యవహారమంతా ఆయనకు ప్రతికూలంగా మారింది. దీనికి తోడు క్షేత్ర స్థాయి అధ్యయనం లేకుండానే విదేశీయులపై బ్యాన్ విధించడం వంటి చర్యలు బెడిసికొట్టాయి.

 ఉద్యోగులపై ఆధిపత్యం:

ఉద్యోగులపై ఆధిపత్యం:

జ్యుడిషియల్ తో పాటు మరికొన్ని శాఖల్లో.. కొంతమంది ఉద్యోగులను తొలగించి.. తనకు అనుకూలంగా ఉన్నవారితో ట్రంప్ తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారన్న ఆరోపణ ఉంది. ఇది కూడా ఆయనపై మరింత వ్యతిరేకత పెరిగేలా చేసింది. ఇక కొత్త హెల్త్ పాలసీ కోసం ఒబామా కేర్ ను ఎత్తేయడం కూడా చాలామంది ప్రజలకు నచ్చలేదు. దీంతో ఈ వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్నట్లయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High quality global journalism requires investment. Please share this article with others using the link below, do not cut & paste the article.
Please Wait while comments are loading...