దూరదర్శన్ లేడీ యాంకర్ తప్పుల మీద తప్పులు
న్యూఢిల్లీ: దూరదర్శన్ మహిళా యాంకర్ తన నోటి వెంట తప్పుల మీద తప్పులు దొర్లించారు. గవర్నర్ ఆఫ్ ఇండియా అంటూ ఆమె నోటి వెంట ధారాళంగా ప్రవహించింది. దీంతో దూరదర్శన్‌కు తలనొప్పి వచ్చి పడింది. దానికితోడు మహిళా గవర్నర్‌ను అతడు అంటూ సంబోధించి ప్రసారభారతిని చిక్కుల్లో పడేశారు.
అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) నవంబర్ 20వ తేదీన గోవాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దూరదర్శన్ యాంకర్ అతిథులను పలకరిస్తూ అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి గవర్నర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన వద్ద ఉన్నారని చెబుతూ ఆయన తన అభిప్రాయాలను మనతో పంచుకుంటారంటూ నొక్కి వక్కాణించారు.

ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో దూరదర్శన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, పొరపాటును సరిచేసుకుని నాలుగు నిమిషాల తర్వాత తిరిగి ప్రసారం చేశామని డిడి ఉన్నతాధికారి ఒకరు అన్నారు. జరిగిన తప్పునకు గల కారణాలను తెలుసుకునేందుకు ఎడిజి స్థాయి అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. గవర్నర్ ఆఫ్ ఇండియా అంటూ సంబోధించిన యాంకర్ కాంట్రాక్టు ఉద్యోగిని అని చెప్పారు. ఆమె సరిగా సిద్ధం కాలేదని చెప్పారు.
ఇంతకు ముందు కూడా దూరదర్శన్‌కు ఇటువంటి పరిస్థితి ఎదురైంది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పేరులోని ఎక్స్ఐని రోమన్ సంఖ్య అనుకుని ఓ యాంకర్ ఎలెవన్‌గా పలకడంతో డిడిపై విమర్శలు వ్చచాయి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆయనకు సంబంధించిన వార్తలు చదువుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేసిన ఉదంతం కూడా ఉంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications