గే భర్త: డాక్టర్ నోట్‌ను 3,500 సార్లు షేర్ చేశారు
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుడైన భర్త వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఎయిమ్స్ వైద్యురాలి సూసైడ్ నోట్‌ను ఫేస్‌బుక్‌లో 3,500 సార్లు షేర్ చేశారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్‌లో ఆమె ప్రొఫైల్ పేజీని నివాళి పేజీగా మార్చేశారు. ప్రియా వేది అనే 31 ఏళ్ల ఎయిమ్స్ వైద్యురాలు పహార్‌గంజ్ హోటల్లో మరణించిన విషయం తెలిసిందే. ఆ హోటల్లో ఆమె రాసి పెట్టిన సూసైడ్ నోట్ లభించింది.
ఆమె ప్రొఫైల్ పేజీని సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఐటి టీమ్ సోమవారం సాయంత్రం నివాళి పేజీగా మార్చేసింది. ఆ పేజీని ప్రియావేదిని గుర్తు చేసుకుంటూ అని మలిచారు. అయితే ఆమె సూసైడ్ నోట్ టైమ్‌లైన్ నుంచి కనిపించుకుండా పోయింది.

స్వలింగ సంపర్కుడైన(గే) భర్త తనను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తుండటంతో ఎయిమ్స్‌కు చెందిన 31ఏళ్ల వైద్యురాలు చేతిని కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భర్త కూడా ఎయిమ్స్‌లోనే వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఎయిమ్స్‌లో వైద్యులుగా పని చేస్తున్న వీరిద్దరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త గే అనే విషయం వివాహానంతరం తెలిసినా సర్దుకుపోయాననీ, ఆ తర్వాత వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆమె తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
భర్త అసహజ తీరు తెలిశాక కూడా ఆయన్నే కోరుకున్నానంటే దానికి కారణం తాను ఆయన్ని అమితంగా ప్రేమించడమేనని ఫేస్‌బుక్‌లో ఆమె చివరిసారిగా పేర్కొంది. భర్త కుటుంబం మంచిదేనని పేర్కొన్న ఆమె.. తన భర్త మాత్రం దెయ్యమని రాశారు.
భర్తతో గొడవ పడిన ఆమె ఓ హోటల్‌లో గది తీసుకుని, అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. హోటల్ యాజమాన్యం సమాచారం మేరకు గది తలుపులు పగలగొట్టిన పోలీసులు, రక్తపు మడుగులో పడివున్న వైద్యురాలిని గుర్తించారు.












Click it and Unblock the Notifications