ఎమర్జెన్సీ మళ్లీ రావొచ్చు:అద్వానీ, మోడీకి కేజ్రీ పంచ్! (వీడియో)

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ రావొచ్చునని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మరోసారి రావొచ్చని అన్నారు.

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇంటర్వ్యూలో అద్వానీ మాట్లాడారు. 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చారు. 1975 నాటి అత్యయిక పరిస్థితి వాతావరణం, రాజకీయ వ్యవస్థ ఇంకా రాలేదని, అయితే భవిష్యత్తులో రాబోదని తాను చెప్పలేనన్నారు.

భారత దేశంలో పౌర స్వేచ్ఛకు భంగం కలగబోదన్న నమ్మకం కలిగేలా పాలన జరగడం లేదని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితి రావడం, ఎమర్జెన్సీ విధింపు అంత సలువు ఏమీ కాదని అభిప్రాయపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో అద్వానీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

అద్వానీ వ్యాఖ్యల పైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ సీనియర్ నేత ఎంజే అక్బర్ తదితరులు స్పందించారు. అద్వానీజీ సరిగానే చెప్పారని, ఎమర్జెన్సీ వచ్చే పరిస్థిని కొట్టి పారేయలేమని, ఢిల్లీ తొలి ప్రయోగం కావొచ్చని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ నేత ఎంజే అక్బర్ మాట్లాడుతూ.. అద్వానీ ఎవరినీ వ్యక్తిగతంగా అనలేదని, ఎమర్జెన్సీ పరిస్థితి ఉండదని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా బలంగా ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+