గోపీచంద్‌కు 'తెలంగాణ' షాక్: అలీకి సింధు కౌంటర్

హైదరాబాద్: ఏస్ షట్లర్ పీవీ సింధు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. గోపీచంద్ మంచి కోచ్ అని ఆమె కితాబిచ్చారు. పీవీ సింధు రజతం గెలిచిన అనంతరం హైదరాబాదులో రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆమెను సన్మానించింది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సింధు వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచేందుకు అంతర్జాతీయ కోచ్‌ను చూస్తున్నామని చెప్పారు. అనంతరం విమర్శలు రావడంతో తాము గోపీచంద్‌ను తప్పుపట్టలేదని వివరణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో బుధవారం నాడు పవీ సింధు మాట్లాడారు. తాను కోచ్ గోపీచంద్ శిక్షణలోనే కొనసాగుతానని చెప్పారు. నా వరకు గోపీచంద్ చాలా మంచి కోచ్. అదే సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కామెంట్ చేసిన వ్యాఖ్యల పైన తాను ఏమీ మాట్లాడదల్చుకోలేదని చెప్పారు.

 ‘Gopichand is best coach’: Sindhu on Telangana dy CM’s ‘foreign coach’ offer

సన్మాన సభ సందర్భంగా మమూద్ అలీ మాట్లాడుతూ.. మన తెలంగాణ అమ్మాయి రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడం ద్వారా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందని, ఆమె మరింత ముందుగు సాగేందుకు తాము మంచి కోచ్‌ను నియమిస్తామని, ప్రస్తుతం ఉన్న గోపీచంద్ కూడా మంచి కోచ్ అని, కానీ అంతర్జాతీయ మ్యాచుల కోసం మంచి కోచ్‌న ఏర్పాటు చేస్తామని, అప్పుడు ఆమె గోల్డ్ మెడల్ సాధిస్తుందన్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఏస్ షట్లర్ పీవీ సింధు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. గోపీచంద్ మంచి కోచ్ అని ఆమె కితాబిచ్చారు. పీవీ సింధు రజతం గెలిచిన అనంతరం హైదరాబాదులో రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆమెను సన్మానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+