• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబా, హనీలది ఒకే కంచం, ఒకే మంచం.., ‘మల్లీశ్వరి’ లాంటి ఫిగర్ కోసం, పారిపోయేముందు ఏం చేసిందంటే..

By Ramesh Babu
|
  Gurmeet Ram Rahim's Honeypreet Wanted to Have Figure Like Katrina kaif | Oneindia Telugu

  న్యూఢిల్లీ: డేరాబాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆరాచకాలన్నీ ఒక్కొక్కటీ బట్టబయలవుతున్న సంగతి తెలిసిందే. జైలుకు వెళ్లిన తరువాత.. ఆయన ఆశ్రమంలోని ఒకరిద్దరు సాధ్వీలు బయటకు వచ్చి పలు విషయాలు వెల్లడిస్తున్నారు.

  ఇప్పటికే ఆయన ప్రియకుమార్తె హనీప్రీత్ ఇన్సాన్ తో ఆయనకున్న సంబంధం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హనీప్రీత్ స్నేహితురాలు, డేరా మాజీ సాధ్వీ ఒకరు మీడియా ముందుకు వచ్చారు. ఆమె మరిన్ని విషయాలు వెల్లడించారు.

  ఇద్దరిదీ ఒకే కంచం, ఒకే మంచం...

  ఇద్దరిదీ ఒకే కంచం, ఒకే మంచం...

  డేరా సచ్ఛా సౌదా చీఫ్, అత్యాచారం కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ చెబుతున్నట్లు హనీప్రీత్ ఇన్సాన్ ఆయన కుమార్తె కాదని ఆమె స్నేహితురాలు, డేరా మాజీ సాధ్వీ కుండబద్ధలు కొట్టారు. వారిద్దరూ అత్యంత సన్నిహితంగా, భార్యాభర్తల మాదిరిగా మెలిగేవారని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు, వారిద్దరూ ‘ఒకే కంచం, ఒకే మంచం' మాదిరిగా ప్రవర్తించే వారట. ఇద్దరూ ఒకటే బెడ్ మీద కూడా పడుకునేవారని, బయటికి వెళ్లేటప్పుడు కూడా కలిసే వెళ్లే వారని తెలిపారు. డేరా బాబా, హనీప్రీత్ ఇద్దరూ అత్యంత సన్నిహితంగా మెలగడం తాను చూశానని, కారులో సైతం వారు అలాగే ఉండేవారని తెలిపింది. బయట పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా వారిద్దరూ హోటల్లో ఒకే గది తీసుకుని ఒకే బెడ్ పై పడుకునే వారట. నిజంగా తండ్రీ కూతుళ్లే అయితే మరిలా చేస్తారా? అన్నది.. ఇప్పుడు వీరిద్దరి మధ్య సంబంధం గురించి తెలిసిన అందరి మదినీ తొలిచివేస్తున్న ప్రశ్న.

  ‘మల్లీశ్వరి' లాంటి ఫిగర్ కోసం...

  ‘మల్లీశ్వరి' లాంటి ఫిగర్ కోసం...

  డేరా బాబా సహచరి హనీప్రీత్ ఇన్సాన్ తన అందం, శరీర సౌష్టవం పట్ల అమితాసక్తులు ప్రదర్శించేదట. హనీప్రీత్ జిమ్ ట్రైనర్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె.. హీరోయిన్ కత్రీనాఖైఫ్(మల్లీశ్వరి ఫేం) లాంటి ఫిగర్ కావాలని కోరుకునేది. ఇందుకోసం గంటల తరబడి జిమ్‌లో ఉండేది. తాజాగా హనీప్రీత్ జిమ్ ట్రైనర్ మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. డేరా ఆశ్రమంలో బాబా, హనీప్రీత్‌లకు ఒక ప్రత్యేక అత్యాధునిక జిమ్ ఉంది. దీనిలోకి మరెవరికీ ప్రవేశం లేదు. హనీప్రీత్ తన ఫిగర్ జీరో సైజ్‌కు మారాలని తెగ తాపత్రయ పడేది. ఇందుకోసం కత్రీనా జిమ్ విధానాలను అనుసరిస్తూ రోజూ మూడు గంటలపాటు వర్కవుట్స్ చేసేది. అలసటకు గురైనప్పుడు ‘ధూమ్-3' సినిమాలోని కత్రినా కైఫ్ పాటకు నృత్యం చేస్తూ అలసట తీర్చుకునేదట. అయితే తాను చెప్పిన డైట్ చార్ట్ ను మాత్రం హనీప్రీత్ ఫాలో అయ్యేదికాదని, తనకి తానే స్వయంగా డైట్ ప్లాన్ తయారు చేసుకుని అనుసరించేదని సదరు జిమ్ ట్రైనర్ పేర్కొన్నారు. అంతేకాదు, హనీప్రీత్ ‘జుంబా' కోసం ప్రత్యేకంగా ఓ విదేశీ ట్రైనర్‌ను ఏర్పాటు చేసుకుందట.

  పారిపోయే ముందు...

  పారిపోయే ముందు...

  ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో ప్రస్తుతం గుర్మీత్ రామ్‌ రహీమ్ రోహ్‌తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. డేరా బాబాకు శిక్ష పడినప్పటి నుంచి ఆయన సహచరి హనీప్రీత్ ఇన్సాన్ మాయమైంది. ఆమె కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లారో ఎవరికీ అంతుబట్టడం లేదు. కొందరేమో హనీప్రీత్ నేపాల్ కు పారిపోయిందంటే.. మరికొందరేమో ఆమె డేరాలోనే ఎక్కడో తలదాచుకుని ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తొలుత రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వచ్చినట్టు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హనీప్రీత్ గత సోమవారం ఉదయ్‌పూర్‌లోని సెలబ్రేషన్‌ మాల్‌కు వచ్చినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఝాడోల్‌లోని డేరా ఆశ్రమానికి వెళ్లినట్లు వెల్లడైంది. అక్కడ కొందరు బాబా సన్నిహితులను హనీప్రీత్ కలుసుకుంది. హర్యానా పోలీసులకు ఆమె లొకేషన్ సెలబ్రేషన్‌ మాల్‌లో లభ్యమైంది. ఇదే మాల్ కు గత ఆగస్టు మొదటి వారంలో గట్టి బందోబస్తు మధ్య గుర్మీత్ రామ్‌ రహీమ్ తన కుటుంబ సభ్యులతో కలిసివచ్చి షాపింగ్‌ కూడా చేశాడు.

  ‘హనీ హనీ'.. గుర్మీత్ కలవరింపు...

  ‘హనీ హనీ'.. గుర్మీత్ కలవరింపు...

  ఒకవైపు హనీప్రీత్ ఇన్సాన్ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేసి గాలిస్తుంటే.. మరోవైపు జైలులో డేరాబాబా కూడా హనీప్రీత్ కోసం కలవరించిపోతున్నాడు. ఆమె కోసం గతంలోనే సీబీఐ కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశాడు గుర్మీత్. ఆమె తన ఫిజియోథెరపిస్టు అని, రోజూ తనకు మసాజ్ చేస్తుందని, ఇప్పుడు జైలులో ఆ మసాజ్ లేకపోవడం వల్ల తనకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, దయచేసి తాను ఉన్న జైలుగదిలోనే తనకు తోడుగా ఆమెనూ ఉంచాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. కానీ అతడి పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో హనీప్రీత్ కోసం గుర్మీత్ తీవ్రంగా మథనపడుతున్నాడు. జైలు గదిలో అతడు కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఇన్నాళ్లూ హనీప్రీత్ వలలో పడి డేరా బాబా తన కుటుంబానికి కూడా దూరమయ్యాడు. ఇరవైనాలుగు గంటలూ ఆమెతోనే కలిసి ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు ఆమె ఒక్కసారిగా దూరమయ్యేసరికి డేరాబాబా పిచ్చెక్కిపోయి జైలులో జుట్టుపీక్కుంటున్నాడట.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In an interesting yet dramatic twist to the ongoing murmur over the enigma that Honeypreet has become, her gym trainer today speaking exclusively to India Today revealed that she aspired to be like Katrina Kaif.Apparently, Dera chief Gurmeet Ram Rahim's favourite angel did not want to limit herself being just Papa's Angel but become a baby doll in real life- Like Bollywood starlet Katrina Kaif. "She wanted a zero figure... would break into a dance routine in middle of her workout, specially on Katrina's song from Dhoom 3," she added.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more