టీడీపీ, టీఆర్ఎస్ ప్లస్ అన్నాడీఎంకే ఒత్తిళ్లు..

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వైద్య విద్యలో సమూల సంస్కరణలు అమలు చేసేందుకు ప్రతిపాదించిన 'నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) - బిల్లు, 2017' ని పార్లమెంట్ జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపడానికి ముందు తెర వెనుక జరిగిందేమిటి? అధికార బీజేపీతోపాటు రాజకీయ పార్టీలన్నీ, సిద్ధాంతాలు, భావాలకు అతీతంగా బిల్లును వ్యతిరేకించడానికి తెర వెనుక లాబీయింగ్ భారీగానే జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యుల ఒత్తిళ్లు, మంత్రులతో వరుస భేటీలతో వాస్తవ పరిస్థితులు విశద పరిచారని వార్తలొచ్చాయి.

మరోవైపు ఎన్ఎంసీ వల్ల తమ ముందుకు వచ్చిన ముప్పును ఎదుర్కొనేందుకు వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అప్రమత్తం కావడంతోపాటు ప్రజల్లో అవగాహనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా మంగళవారం ఎనిమిది గంటల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఔట్ పేషంట్ సర్వీసులు నిలిచిపోయాయి. బిల్లును పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించాకే ఐఎంఎ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్రతిపాదించలేదన్న రాంగోపాల్

పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్రతిపాదించలేదన్న రాంగోపాల్

‘ఎన్ఎంసీ' బిల్లును ప్రతిపాదించిన ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాపై తొలుత పార్లమెంట్‌లో సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ తొలిసారి మండిపడ్డారు. ఆరోగ్య రంగంపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి రాంగోపాల్‌యాదవ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించడం గమనించదగ్గ పరిణామం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లు - 2017ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టొచ్చని ఆమోదం తెలుపలేదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాశారు. ముసాయిదా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని సిఫారసు చేశామని పేర్కొన్నారు. కాగా, బిల్లులో మార్పులు, చేర్పులు ఉంటే బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యేలోగా నివేదిక సమర్పించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదేశించడం గమనార్హం.

 బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే సభలోనే వ్యతిరేకత

బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే సభలోనే వ్యతిరేకత

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మరో కమిటీ చైర్మన్ జైరాం రమేశ్ కూడా రాంగోపాల్ యాదవ్ మాదిరిగానే స్పందించారు. ఇంతకుముందు ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘమే.. ఎంసీఐను రద్దు చేసేందుకు ఎన్ఎంసీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిందని బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టడానికి ముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా పేర్కొనడం గమనార్హం. మరో ఆసక్తికర అంశమేమిటంటే ‘ఎన్ఎంసీ' బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకముందు కూడా దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

టీఆర్ఎస్, టీడీపీ, అన్నాడీఎంకే సభ్యుల లాబీయింగ్

టీఆర్ఎస్, టీడీపీ, అన్నాడీఎంకే సభ్యుల లాబీయింగ్

గత శుక్రవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఎన్ఎంసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన తర్వాత వైద్య రంగ ప్రముఖులు అప్రమత్తం అయ్యారు. గమ్మత్తేమిటంటే ఈ బిల్లు ఆమోదం పొందడం కోసం అధికార బీజేపీ.. బయట నుంచి మద్దతునిస్తున్న టీఆర్ఎస్, అన్నాడీఎంకేతోపాటు టీడీపీ సభ్యులతో ఎటువంటి సంప్రదింపులు కూడా జరుపలేదు. టీఆర్ఎస్, టీడీపీ, అన్నాడీఎంకే పార్లమెంట్ సభ్యుల్లో కనీసం 23 మంది వైద్యులు ఉన్నారు. వారిలో కొందరు ప్రైవేట్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్న వారు ఉన్నారు. ఎంపీలుగా ఎన్నికైన ఆ వైద్యుల గ్రూప్ రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషిస్తున్న మంత్రులు అరుణ్ జైట్లీ, అనంతకుమార్, జేపీ నడ్డాలతో జోరుగా లాబీయింగ్ జరిపింది.

 ఎన్ఎంసీ బిల్లులో లోపాలపై ఇలా అవగాహన

ఎన్ఎంసీ బిల్లులో లోపాలపై ఇలా అవగాహన

నూతన సంవత్సరం ప్రారంభానికి మూడు రోజుల ముందు 2500 ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) శాఖలు కూడా లాబీయింగ్ చేపట్టారు. తమ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలతో దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టారు. బిల్లులో పొరపాట్లు, వివాదాలను వాటి పర్యవసనాలపై అవగాహన కల్పించారు. ఐఎంఎ దేశవ్యాప్తంగా దినపత్రికల్లో వాణిజ్య ప్రకటనలు కూడా జారీ చేసింది. ఈ బిల్లు తమ ప్రయోజనాలకు వ్యతిరేకం కావడంతోపాటు తిరోగమన మార్గంలో ప్రయాణిస్తున్నదని వైద్యులు చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీల వ్యతిరేకతకు కాక వైద్య రంగ ప్రముఖుల తీవ్రమైన వ్యతిరేకత, నిరసనకు జడిసి మాత్రమే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపినట్లు తెలుస్తోంది. కానీ ప్రతిపాదిత ‘ఎన్ఎంసీ' బిల్లుపై బీజేపీలోనే అంతర్గతంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 ప్రభుత్వ కళాశాలలు సరే.. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు ప్రియమే సుమా

ప్రభుత్వ కళాశాలలు సరే.. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు ప్రియమే సుమా

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం అమలులోకి వస్తే 2019 ఎన్నికల్లో గణనీయ స్థాయిలో వైద్యవిద్యా కోర్సులు పెరుగుతాయని, ఓట్లు భూరీగా కొల్లగొట్టొచ్చని అధికార బీజేపీ నేతలు, అధి నాయకత్వం భావించింది. ‘ఎన్ఎంసీ' బిల్లు చట్టమైతే వైద్య విద్య చౌకగా అందుబాటులోకి వస్తుందని, వైద్యవిద్యను అభ్యసించేందుకు వీలవుతుందన్న ఆశలు కల్పించింది బీజేపీ. అయితే ఇక ముందు వైద్యవిద్య అభ్యసించడానికి ఎంత ఫీజు చెల్లించాలన్నదీ నిర్ణయించించాల్సిందీ నేషనల్ మెడికల్ కమిషన్ కావడం గమనార్హం. ఇక్కడ ఒక సమస్య ఉన్నది ప్రభుత్వ కళాశాలల్లో ఫీజులు ఒకింత తక్కువే ఉంటాయి. కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపు, ఫీజుల వ్యవహారాలు ఆయా సంస్థల యాజమాన్యాల నిర్ణయాలను బట్టి నిర్ణయం జరుగుతుంది. ఎన్ఎంసీ సిఫారసుచేసినా.. యూనివర్సిటీ ఫీజుకు ప్రైవేట్ కాలేజీలకు అదనంగా ఫీజులు చెల్లించాల్సిందే. అదనంగా ఎంత మేరకు ఫీజులు చెల్లించాలన్నది చెప్పలేం.

 వైద్య విద్య విస్తరణపై గుజరాత్‌లో రాహుల్ ఇలా ప్రచారం

వైద్య విద్య విస్తరణపై గుజరాత్‌లో రాహుల్ ఇలా ప్రచారం

ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జరిపిన ప్రచార దాడిలో ‘వైద్య కళాశాలల' అస్త్రం కూడా ఒకటి. మెడికల్ కాలేజీలను జైడస్ ప్రమోటర్ పంకజ్ పటేల్ వంటి వారికి బీజేపీ ప్రభుత్వం విక్రయిస్తున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడు గౌతం ఆదానీ వంటి వారికి పంకజ్ పటేల్ స్నేహితులు.
అసలే ఎన్నికల ఫలితాలతో వెనుకబడి ఉన్న బీజేపీ.. ఇప్పటికైనా ముందుచూపుతో వ్యవహరించాలని ప్రయత్నిస్తున్నది.

ఎంసీఐకి భిన్నంగా ప్రభుత్వ నియంత్రణలోకి ఎన్ఎంసీ

ఎంసీఐకి భిన్నంగా ప్రభుత్వ నియంత్రణలోకి ఎన్ఎంసీ

కానీ కేంద్ర ఆరోగ్యశాఖ అధికార వర్గాలు మాత్రం ప్రతిపాదిత ‘ఎన్ఎంసీ' బిల్లును గట్టిగా సమర్థించుకుంటున్నాయి. అవినీతిని అంతం చేస్తుందని గట్టిగా చెప్తున్నారు. తమ అభిప్రాయాలను ప్రజలకు తెలియజేసేందుకు వివిధ దిన పత్రికల్లో ఒక పూర్తి పేజీ వాణిజ్య ప్రకటన కూడా జారీ చేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ). నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కేవలం కొత్త కమిషన్ మాత్రమే కాదని, పూర్తిగా వైద్య విద్యా రంగాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొస్తుంది. ఇప్పటి వరకు ఎంసీఐ పరిధిలో స్వయం ప్రతిపత్తి ఉండేది. కానీ ప్రభుత్వ అంచనాలకు భిన్నంగా ఎన్ఎంసీ వల్ల అవినీతి పలు రెట్లు అధికంగా పెరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 అవకతవకలకు పాల్పడితే ఒక బ్యాచ్ సగం ఫీజు పెనాల్టీ

అవకతవకలకు పాల్పడితే ఒక బ్యాచ్ సగం ఫీజు పెనాల్టీ

ప్రభుత్వ వైఖరి వల్ల తాము ‘వైద్య వ్రుత్తి'లో గత శుక్రవారాన్ని ‘బ్లాక్ డే'గా ప్రకటించక తప్పలేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధి ప్రుథ్వీ సంఘ్వీ చెప్పారు. ప్రతి పేషంట్‌కు అందుబాటులోకి వైద్యం అన్న నినాదం.. ఎన్ఎంసీ వల్ల సాధ్యం కాదని తేల్చేశారు. ఎన్ఎంసీ ప్రకారం ఏదైనా మెడికల్ కాలేజీలో లోపాలు, ఖాళీలు ఉన్నా ముగ్గురు సభ్యులతో కూడిన మెడికల్ అక్రిడిటేషన్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఎఆర్) అధ్యయనం చేసి తదుపరి చర్యలను ప్రతిపాదిస్తుంది. అవకతవకలు జరిగిన కాలేజీ ఆ ఏడాది మొత్తం వైద్య విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులో కనీసం పెనాల్టీ సగం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ముగ్గురు సభ్యుల నామినేటెడ్ కమిటీ విధాన నిర్ణయాలా?

ముగ్గురు సభ్యుల నామినేటెడ్ కమిటీ విధాన నిర్ణయాలా?

ఉదాహరణకు ఒక బ్యాచ్ విద్యార్థులు 150 మంది ఉంటే వారి వద్ద వసూలు చేసే ఫీజు ఏడాదికి రూ.15 కోట్లు ఉంటుంది. ‘ఎంఎఆర్' అధ్యయన నివేదిక ప్రకారం కనీసం పెనాల్టీ రూ.7.5 కోట్లు ఉంటుందని, అది పది రెట్లు పెరిగే అవకాశం కూడా ఉన్నదని ఐఎంఎ వర్గాలు అంటున్నాయి. కేవలం కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ మాత్రమే సదరు అవకతవకలకు పాల్పడిన కాలేజీపై పెనాల్టీ విధించడమేమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The government ate humble pie Tuesday as the controversial National Medical Commission Bill 2017 was sent to Parliament's standing committee on health.That happened amid protests not just by the Opposition, but within the ranks of the BJP, too.This was followed a flash strike by doctors across the country.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి