వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి పూజితతో పరిచయం ఇలా..: ఎవరీ ఐఏఎస్ రేఖారాణి, విజయగోపాల్? (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: తన భర్త విజయ గోపాల్ తనను మోసం చేశాడని, తనతో పాటు పలువురు మహిళలను మోసం చేశాడని నటి పూజిత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోకి ఆమె ఇద్దరు ఐఏఎస్ మహిళా ఐఏఎస్ ఆఫీసర్లను కూడా లాగిన విషయం తెలిసిందే.

తన భర్త విజయ గోపాల్ ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని పెళ్లి చేసుకున్నాడని పూజిత ఆరోపించారు. ఈ రేఖారాణి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) మేనేజింగ్ డైరెక్టర్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

ఆ సమయంలో రేఖారాణి ప్రధానంగా వెలుగులోకి వచ్చారు. సచిన్ టెండుల్కర్ 2014లో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె ఆ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్నారు. రేఖారాణి దివంగత అధికారి పరదేశి నాయుడు సతీమణి.

భయపడను: నటి పూజిత ఇష్యూలో ట్విస్ట్, తెరపైకి మరో ఐఏఎస్, '12ఏళ్లు సహజీవనం' భయపడను: నటి పూజిత ఇష్యూలో ట్విస్ట్, తెరపైకి మరో ఐఏఎస్, '12ఏళ్లు సహజీవనం'

పరదేశీ నాయుడు ఇరవై రెండేళ్ల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో మైనింగ్ బ్లాస్ట్‌లో చనిపోయాడు. రేఖా రాణి పరదేశి నాయుడు సతీమణి. రేఖారాణి సీనియర్ ఐఏఎస్ అధికారణి. తన భర్త మృతి అనంతరం ఆమె ఉద్యోగంలోకి వచ్చారు. ఆమె తొలుత ఆర్డీవోగా పని చేశారు. రేఖారాణి తనయుడు అమెరికాలో ఓ ఎమ్మెన్సీ కంపెనీలో పని చేస్తున్నారు.

విజయ గోపాల్ జర్నలిస్ట్‌గా పని చేశారు. అతను ప్రస్తుతం అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత పీఏగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం విజయ గోపాల్ - రేఖారాణిలు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి అంజనా తొలి సాక్షి అని పూజిత అంటున్నారు.

మరోవైపు, పూజిత నటి. ఆమె పలు తెలుగు చిత్రాల్లో నటించారు. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత టీవీ సీరియల్స్ బిజీ అయ్యారు. రుతురాగాలు సీరియల్‌లో నటించారు. కాగా ఈమె ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు బుక్ చేయలేదు. అయితే, విచారణ జరుపుతున్నారు.

పెళ్లి చేసుకున్నారని పూజిత, కోర్టుకెళ్లొచ్చని రేఖారాణి, విజయ గోపాల్

విజయ గోపాల్ తనను పెళ్లి చేసుకున్నారని, తమ ఇద్దరికీ ఓ కొడుకు ఉన్నాడని, ఇప్పుడు ఐఏఎస్ రేఖారాణిని పెళ్లి చేసుకున్నాడని నటి పూజిత ఆరోపిస్తున్నారు. అతను తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని, అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

అదే సమయంలో, ఏప్రిల్ 28వ తేదీన పెళ్లి చేసుకున్న విజయ గోపాల్ - రేఖారాణిలు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. పూజితతో కేవలం విజయ గోపాల్‌ది సహజీవనమేనని, పెళ్లి చేసుకోలేదని ఇరువురు చెబుతున్నారు. తాను అన్నీ లీగల్‌గా చూసుకున్నాకే అతనిని పెళ్లాడానని రేఖారాణి చెబుతున్నారు.

పూజిత తమకు పరువు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని, ఆమె మీడియాకు ఎక్కకుండా చట్టబద్ధంగా కోర్టుకు వెళ్లవచ్చునని చెప్పారు. తాను మాత్రం అతని గురించి అంతా తెలుసుకునే పెళ్లి చేసుకున్నానని, అలాగే పూజితను అతను పెళ్లి చేసుకోలేదని, కేవలం సహజీవనమే అన్నారు.

పూజిత

పూజిత

దివంగత పరదేశి నాయుడు సతీమణి, ఐఏఎఎస్ అధికారిణి రేఖా రాణి రెండో వివాహం వివాదాస్పదమైంది. రేఖా రాణి తన భర్త విజయ గోపాల్‌ను పెళ్లి చేసుకున్నారని, అతను తనకు విడాకులు ఇవ్వలేదని నటి పూజిత ఆరోపిస్తున్నారు.

పూజిత

పూజిత

పూజిత విజయ గోపాల్ పైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుమారుడికి ప్రాణభయం ఉందని చెప్పారు.

పూజిత

పూజిత

విజయ గోపాల్ మోసగాడని, అతని పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని, అతను తన భర్త అనేందుకు ఆధారాలు ఉన్నాయని పూజిత చెబుతున్నారు.

పూజిత, విజయ గోపాల్

పూజిత, విజయ గోపాల్

ఓ సినిమా షూటింగులో విజయ గోపాల్ సినిమా రిపోర్టర్‌గా పరిచయమయ్యాడని, ఆ పరిచయం ప్రేమకు దారి తీసిందని, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని చెప్పారు.

పూజిత, విజయ గోపాల్

పూజిత, విజయ గోపాల్

నా సంపాదన అంతా అతని అప్పులు తీర్చడానికే సరిపోయిందని పూజిత ఆరోపిస్తున్నారు. ఆ రాత్రి చెప్పా పెట్టకుండా పారిపోయారని చెప్పారు.

పూజిత, విజయ గోపాల్

పూజిత, విజయ గోపాల్

విజయ గోపాల్ ఆచూకీ కోసం ప్రయత్నించానని దొరకలేదని, చివరకు రేఖా రాణి తల్లిదండ్రులే ఆయన ఆచూకీ చెప్పారన్నారు.

పూజిత, విజయ గోపాల్

పూజిత, విజయ గోపాల్

తనకు విడాకులు ఇవ్వకుండానే విజయగోపాల్ రెండో పెళ్లి చేసుకున్నారని, రేఖా రాణితో ఆయన పెళ్లి న్యాయపరంగా సరికాదని పూజిత అంటున్నారు.

పూజిత, విజయ గోపాల్

పూజిత, విజయ గోపాల్

అయితే, పూజిత ఆరోపణలను విజయ గోపాల్ కొట్టి పారేస్తున్నారు. తనకు పూజితతో పెళ్లి కాలేదని, సహజీవనం మాత్రమే చేశానని చెబుతున్నారు.

రేఖా రాణి

రేఖా రాణి

మరోవైపు, పెళ్లి వివాదంపై శాప్ ఎండీ రేఖా రాణి స్పందించారు. విజయ గోపాల్ - పూజితలు ఎప్పుడో విడిపోయారని, వారిద్దరికి పెళ్లి కాలేదని, సహజీవనం మాత్రమే చేశారని చెప్పారు.

మరోవైపు, పూజిత మాట్లాడుతూ... రేఖా రాణిని తన భర్త పెళ్లి చేసుకున్నాడనే విషయం తెలియగానే తాను ఆమెకు తన భర్త చీటింగ్ గురించి చెప్పానని అంటున్నారు.తమకు ప్రాణభయం ఉందన్నారు.

ఇదిలా ఉండగా, తన తల్లి కామాక్షఖి... పూజితకు మద్దతు ఇవ్వడాన్ని రేఖారాణి తప్పుబట్టారు. తమ పెళ్లి తన తల్లికి ఇష్టం లేదని, అందుకే ఆమె పూజితకు అండగా నిలబడ్డారని చెబుతున్నారు. తాను ఐఏఎస్ అధికారిణి, అతను జర్నలిస్ట్ కాబట్టి తన తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పారు. పెళ్లి విషయంలో తన తల్లిని తాను ఒప్పించే ప్రయత్నం చేశానని, ఆమె అంగీకరించలేదన్నారు. తమది రిజిస్టర్ మ్యారేజ్ అని చెప్పారు.

విజయ గోపాల్ మాట్లాడుతూ... పూజితతో తాను సహజీవనం మాత్రమే చేశానని, గత ఏడేళ్లుగా ఆమెతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, కనీసం ఫోన్లోను టచ్‌లో లేదని, ఆమె ఫోన్ నెంబర్ కూడా తన వద్ద లేదని, ఇలాంటప్పుడు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు బయటకు వచ్చారో తెలియదన్నారు. కోర్టుకు వెళ్లొచ్చన్నారు.

English summary
The marriage of Sports Authority of Andhra Pradesh (SAAP) managing director, IAS officer G. Rekha Rani with a former journalist has become controversial after Tollywood and TV actress Poojitha claimed she was already married to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X