వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి కాకుండానే గర్భవతులు: ఆ ఒక్క రాష్ట్రంలోనే 35వేల మంది..

అదే సమయంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.అక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో టీనేజీలో గర్భం దాల్చేవారి సంఖ్య చాలా తక్కువ.

|
Google Oneindia TeluguNews

టెక్సాస్: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన టెక్సాస్ రాష్ట్రంలో టీనేజీ తల్లుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. మైనారిటీ కూడా తీరకుండానే.. పెళ్లితో సంబంధం లేకుండా వారు గర్భం దాలుస్తుండటం అక్కడివారిని కలవరపెడుతోంది. గతంలో కన్నా ఇటీవల కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగినట్లు తాజా సర్వే చెబుతోంది.

సుమారు 35వేల మంది టీనేజీ తల్లులు ఒక్క టెక్సాస్ రాష్ట్రంలోనే ఉన్నారని పేర్కొంది. ఈ టీనేజీ తల్లుల తల్లుల్లోను చాలావరకు టీనేజీలో గర్భం దాల్చినవారే కావడం గమనార్హం. టీనేజీ గర్భం వల్ల ఎడ్యుకేషన్ క దూరమవుతున్న పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోన్న అంశం.

ఇటీవల జేస్సికా చెస్టర్(17) అనే ప్లస్ టూ విద్యార్థిని గర్భం దాల్చగా.. కాలేజీ యాజమాన్యం ఆమెను డీబార్ చేసింది. అయితే ఆమె తల్లి మాత్రం దీని పట్ల సానుకూలంగానే ఉంది. ఒకరకంగా పేదరికమే అక్కడి యువతులను టీనేజీలో గర్భం దాల్చేలా చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

In Texas, Abstinence Only Programs May Contribute To Teen Pregnancies

టీనేజీలో గర్భం దాల్చినవారిలో కేవలం 2శాతం మంది మాత్రమే ప్లస్ టూ నుంచి పై చదువులకు వెళ్తున్నారని, దాదాపు 60శాతం మంది డ్రాపౌట్లుగా మిగిలిపోతున్నారని సర్వే తెలియజేసింది.

అదే సమయంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.అక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో టీనేజీలో గర్భం దాల్చేవారి సంఖ్య చాలా తక్కువ. సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల 1991నుంచి 2012 మధ్య కాలంలో 74శాతం మేర టీనేజీ గర్భవతుల సంఖ్య పడిపోయింది. టెక్సాస్ లో మాత్రం కేవలం 56శాతం మాత్రమే టీనేజీ గర్భవతుల సంఖ్య తగ్గింది.

English summary
To understand why teen pregnancy rates are so high in Texas, meet Jessica Chester. When Chester was in high school in Garland, she decided to attend the University of Texas at Dallas. She wanted to become a doctor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X