వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లో జగన్ దీక్ష, ఢిల్లీలో బాబు ఢీ: మైలేజ్ రాలేదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
సమైక్యాంధ్ర కోసమంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల లోటస్ పాండులో చేసిన దీక్ష తమకు అనుకున్న మైలేజ్ తీసుకు వచ్చిందా? అనే చర్చ ఆ పార్టీలో సాగుతోందట. శనివారం జగన్ దీక్షను ప్రారంభించారు. బుధవారం ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అయితే జగన్ దీక్షతో అనుకున్న మైలేజ్ రాలేదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారట.

అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేసి ఇటు రాష్ట్రంలో, అటు జాతీయస్థాయిలో చర్చనీయంగా మారారని చర్చించుకుంటున్నారట. ఇంట్లో దీక్ష చేసి వైయస్ జగన్ విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ ఇంటి ముందే దీక్ష చేయడం, దీక్షా శిబిరం నుండి కొన్ని గంటల పాటు అందుబాటులో లేకుండా పోయారనే ఆరోపణలు ఆ పార్టీకి అనుకున్నమైలేజ్ తీసుకు రాలేదంటున్నారు.

చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయడమే కాకుండా సీమాంధ్రుల సమస్యను జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారని చెబుతున్నారు. శుక్రవారం తన దీక్షను భగ్నం చేసినా చంద్రబాబు ఫ్లూయిడ్స్ ఎక్కించుకునేందుకు నిరాకరించారు. శనివారం మధ్యాహ్నం వైద్యులు బలవంతంగా ప్లూయిడ్స్ ఇచ్చారు.

అదే సమయంలో లోపాయికారి ఒప్పందం ఆరోపణల నేపథ్యంలో జగన్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన మొక్కుబడిగా విమర్సలు చేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు. బాబు దీక్షను భగ్నం చేశాక తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోనియా ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేశారు.

English summary
The debate is going in political circle that Is YSR Congress Party chief YS Jaganmohan Reddy got mileage with deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X