హైద్రాబాద్‌లో 'కొత్త'వ్యూహంతో విధ్వంసంకు ఐసిస్ ప్లాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఐసిస్ ఉగ్రవాదులు హైదరాబాద్ సహా భారత్‌లోని పలు నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నారు. కొద్ది రోజుల క్రితం వారాంతంలో హైదరాబాదులో పేలుళ్లు, కాల్పులు జరపాలని ఐసిస్ కుట్ర పన్ని విషయం తెలిసిందే.

హైదరాబాద్ తర్వాత.. అనంతపురంని టార్గెట్ చేసిన ఐసిస్, లాడ్జీలో..

ఇంటెలిజెన్స్ ద్వారా తెలియడంతో ఎన్ఐఏ, పోలీసులు పాతబస్తీలో సోదాలు జరిపారు. ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. వారిని ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. విధ్వంసానికో సంస్థ పేరును ఐసిస్ ఉపయోగించుకోవాలనుకున్నారని తెలిసింది.

image

ఇటీవల హైదరాబాదులో విధ్వంసం సృష్టించేందుకు పెట్టుకున్న పేరు.. 'జన్ దుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ ఆల్ హింద్'. వీరిని సిరియాలోని ఐసిస్ ఉ్గరవాద అగ్రనేత షఫీక్ అర్మారే నడిపిస్తున్నారు. హైదరాబాదులో విధ్వంసానికి ఆయనే పై పేరు పెట్టారని తెలుస్తోంది.

హైదరాబాద్‌పై ఐసిస్ చీఫ్ కన్ను: ఎవరెవరికి ఏయే బాధ్యతలు?

నాలుగు నెలలుగా వీరు అదే పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తేలింది. ఈ పేరుతో మరెక్కడా ఉగ్రవాద సంస్థ లేదు. హైదరాబాదులో పేలుళ్ల కోసమే దీనిని స్థాపించారని తెలుస్తోంది.

హైద్రాబాద్‌పై ఐసిస్: 'వీరి వెనుక ఎవరో తెలియాలి', కిచెన్‌లో బాబులు దాచారు

హైదరాబాదులో విధ్వంసానికి ఐసిస్ ఉగ్రవాదులతో కలిసి ప్లాన్ చేశారు. సంప్రదింపుల సమయంలో.. హైదరాబాదులోని పేలుళ్ల కోసం పై పేరుతో చలామణి కావాలని ఐసిస్ టెర్రరిస్టులు సూచించారని తెలుస్తోంది. దీంతో జున్ దుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ ఆల్ హింద్‌ను స్థాపించారు.

ఐసిస్ ప్లాన్: 'క్రాస్ ఎగ్జాం' షాక్, ఎలా బుట్టలో వేస్తారు?

భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేందుకు ఐసిస్.. అన్సార్ ఉల్ తౌహీద్ ఫీ బిలాద్ ఆల్ హింద్ పేరుతో ఒక సంస్థను స్థాపించింది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాదులో నలుగురితో పాటు దేశవ్యాప్తంగా 14 మంది ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వారు జునూద్ ఆల్ ఖలీఫా ఎ హింద్ పేరుతో సంస్థను స్థాపించి విధ్వంసానికి కుట్ర చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
isis sympathisers plan to attack Hyderabad with new organisation name.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి