వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: సంక్షోభంలో వెస్టిండీస్, ఐర్లాండ్ కూన కాదు..!

By Srinivas
|
Google Oneindia TeluguNews

నెల్సన్: ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. దిగ్గజ జట్టు వెస్టిండీస్ పైన పసికూన ఐర్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది సంచలన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 304/7 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఆ లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి 45.5 ఓవర్లలో చేధించింది.

రెండుసార్లు ప్రపంచకప్ గెలుచుకున్న, ఒకసారి ఐసీసీ ప్రపంచ ట్వంటీ20 గెలుచుకున్న, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న వెస్టిండీస్‌కు ఐరిష్ జట్టు ప్రపంచకప్ ఆరంభంలోనే గట్టి షాకిచ్చింది. 1975, 1979లలో రెండుసార్లు ప్రపంచకప్, 2012లో ఐసీసీ ట్వంటీ20 గెలుచుకుంది.

అలాంటి వెస్టిండీస్ జట్టును ఐరిష్.. ఈసారి ప్రపంచకప్ ఆదిలోనే దెబ్బతీసి ఆ జట్టు మనోధైర్యాన్ని కోల్పోయేలా చేసింది. గత కొద్దికాలంగా వెస్టిండీస్ జట్టు ఏమాత్రం ఆకట్టుకునేలా ఆడటం లేదు. ఇప్పుడు పసికూన ఐరిష్‌తో జరిగిన మ్యాచులో ఓడి మరింత పరువు పోగోట్టుకుంది.

Joyful Ireland deepen West Indies turmoil

ఐర్లాండ్‌ను కూడా తక్కువ అంజనా వేయడానికి లేదు. పసికూనే అయిన గత ప్రపంచకప్‌లోని ఇంగ్లాండ్ పైన కూడా గెలిచింది. పసికూలుగా భావించే ఐర్లాండ్, జింబాబ్వే, బంగ్లాదేశ్ వంటి జట్లు పలుమార్లు పెద్ద జట్లకు షాకిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉండగా, వెస్టిండీస్ క్రికెట్ యాజమాన్యం పొలార్డ్ వంటి ఆటగాళ్లను ప్రపంచకప్‌కు పక్కన పెట్టడం గమనార్హం.

వెస్టిండీస్‌కు ఐసీసీ మెంబర్ షిప్ 1993లో వచ్చింది. ఐర్లాండ్ జట్టు 2007లో మొదటిసారి ప్రపంచకప్‌కు క్వాలిఫై అయింది. 2007 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ జట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల పైన విజయం సాధించి తొలిసారి సంచలనం సృష్టించింది. అప్పుడు పాకిస్తాన్ ర్యాంకింగ్‌లో నాలుగో స్థానంలో ఉంది. అలాంటి పాక్‌ను మూడు వికెట్లతో ఓడించింది.

2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పైన గెలిచింది. అప్పుడు కూడా ఇంగ్లాండును మూడు వికెట్ల తేడాతో ఓడించింది. ఇప్పుడు వెస్టిండీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి మరోసారి సంచలనం సృష్టించింది. వన్డే ర్యాంకింగ్‌లో వెస్టిండీస్ ఇప్పుడు అగ్ర జట్లలో ఆఖరి స్థానంలో ఉంది. గత కొద్దికాలంగా వెస్టిండీస్ జట్టు వివాదాలలో కూరుకుపోవడమే కాకుండా, ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వడం లేదు. ఇప్పుడు ఐర్లాండ్ షాక్ మరింత కృంగదీస్తుందని చెప్పవచ్చు.

కాగా, సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌‌లో ఐరిష్ బ్యాట్స్‌మెన్ స్టిర్లింగ్, జోయిస్, ఓ బ్రెయిన్ చెలరేగి ఆడారు. బౌలర్లలో డాక్‌రెల్ మూడు వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లలో సిమన్స్, సామీ మినహా ఎవరు ఆడలేదు. క్రిసే గేల్ పూర్తిగా విఫలమయ్యాడు.

English summary
Joyful Ireland deepen West Indies turmoil
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X