వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందాలు: మంచు దుప్పట్లో కాశ్మీరం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌ సహా వివిధ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండడంతో కాశ్మీర్ లోయకు దేశంలోని మిగతా ప్రాంతాలతో రాకపోకలు స్తంభించిపోయాయి. తాజాగా కురిసిన మంచు ఈ శీతాకాలంలోనే అత్యధికంగా కురిసిన మంచుగా నమోదయింది. ఓ వైపు మంచు వర్షం ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ... ఇక్కడి అందమైన ప్రాంతాలు మాత్రం అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

కాశ్మీర్ లోయకు మిగతా ప్రాంతాల నుంచి గగనతల మార్గం, రోడ్డు మార్గం గుండా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒక అధికారి చెప్పారు. తాజాగా కురిసిన మంచు, విరిగిపడిన కొండ చరియల వల్ల 294 కిలో మీటర్ల పొడవు గల శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని మూసివేసి, ట్రాఫిక్‌ను నిలిపివేశారు.

ఈ జాతీయ రహదారి పొడవునా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తోందని, కొన్నిచోట్ల కొండ చరియలు కూడా విరిగిపడుతున్నాయని, అందువల్ల మూసివేశామని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ అధికారి ఒకరు సోమవారం ఇక్కడ చెప్పారు. అననుకూల వాతావరణం వల్ల వార్షిక పరీక్షలను, విశ్వవిద్యాలయ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.

కాశ్మీరం

కాశ్మీరం

జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌ సహా వివిధ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండడంతో కాశ్మీర్ లోయకు దేశంలోని మిగతా ప్రాంతాలతో రాకపోకలు స్తంభించిపోయాయి.

కాశ్మీరం

కాశ్మీరం

తాజాగా కురిసిన మంచు ఈ శీతాకాలంలోనే అత్యధికంగా కురిసిన మంచుగా నమోదయింది.

కాశ్మీరం

కాశ్మీరం

కాశ్మీర్ లోయకు మిగతా ప్రాంతాల నుంచి గగనతల మార్గం, రోడ్డు మార్గం గుండా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒక అధికారి చెప్పారు.

కాశ్మీరం

కాశ్మీరం

తాజాగా కురిసిన మంచు, విరిగిపడిన కొండ చరియల వల్ల 294 కిలో మీటర్ల పొడవు గల శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని మూసివేసి, ట్రాఫిక్‌ను నిలిపివేశారు.

కాశ్మీరం

కాశ్మీరం

ఈ జాతీయ రహదారి పొడవునా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తోందని, కొన్నిచోట్ల కొండ చరియలు కూడా విరిగిపడుతున్నాయని, అందువల్ల మూసివేశామని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ అధికారి ఒకరు చెప్పారు.

కాశ్మీరం

కాశ్మీరం

అననుకూల వాతావరణం వల్ల వార్షిక పరీక్షలను, విశ్వవిద్యాలయ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.

కాశ్మీరం

కాశ్మీరం

సోమవారం జరగాల్సిన 12వ తరగతి పరీక్షను ప్రతికూల వాతావరణం వల్ల వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని జమ్మూకాశ్మీర్ పాఠశాల విద్య బోర్డు పిఆర్‌ఒ షౌకత్ ఉస్మాన్ చెప్పారు.

కాశ్మీరం

కాశ్మీరం

కాశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తుండడంతో సోమ, మంగళవారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటి అధికారి ఒకరు చెప్పారు.

కాశ్మీరం

కాశ్మీరం

విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల కాశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

కాశ్మీరం

కాశ్మీరం

జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌ సహా వివిధ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండడంతో కాశ్మీర్ లోయకు దేశంలోని మిగతా ప్రాంతాలతో రాకపోకలు స్తంభించిపోయాయి.

English summary
The Kashmir Valley witnessed heavy snowfall on Monday, disrupting surface and air traffic and the MeT office has forecast more rain and snowfall till Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X