వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థర్డ్ ఫ్రంట్ ఆలోచన: చంద్రబాబును కేసిఆర్ బీట్ చేశారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

KCR's Third Front : Will Indian Politics Change ?

హైదరాబాద్: జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు నాయకత్వం వహిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అనూహ్యమైన ప్రకటన చేయడం వెనక వ్యూహం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది.

తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని రెండు నెలల క్రితం నిరుడు డిసెంబర్ 29వ తేదీన కేసీఆర్ చెప్పారు. బంగారు తెలంగాణ సాధన కోసం తాను రాష్ట్రానికే పరిమితమవుతానని కూడా చెప్పారు.

రాజ్‌నాథ్ అడిగితే ఇలా..

రాజ్‌నాథ్ అడిగితే ఇలా..

జాతీయ రాజకీయాల్లోకి వస్తారా అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అడిగితే తను ఆ ఉద్దేశం లేదని చెప్పినట్లు కూడా కేసీఆర్ వెల్లడించారు. కానీ అనూహ్యంగా శనివారంనాడు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

చంద్రబాబు కన్నా ముందే ఉండాలని

చంద్రబాబు కన్నా ముందే ఉండాలని

బిజెపి, కాంగ్రెసులకు ప్రత్యామ్నాయంగా మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తానని కేసిఆర్ ప్రకటించడం వెనక పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు కన్నా తాను ముందుండాలనే ఉద్దేశంతో కేసిఆర్ జాతీయ రాజకీయాలపై ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. (

చంద్రబాబు ఆలోచన ఇదీ...

చంద్రబాబు ఆలోచన ఇదీ...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపియేతర, కాంగ్రెసేతర పార్టీలతో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపిస్తూ బిజెపితో తెగదెంపులు చేసుకుని జాతీయ స్థాయి రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన అనుకున్నారని సమాచారం.

చంద్రబాబు అనుభవం ఇదీ.

చంద్రబాబు అనుభవం ఇదీ.

జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫ్రంట్‌లను ఏర్పాటు చేయడంలో, పొత్తులు పెట్టుకోవడంలోనే కాకుండా తెంచుకోవడంలో చంద్రబాబుకు విశేషమైన అనుభవం ఉంది. కాంగ్రెసుతో కలిసి చంద్రబాబు గతంలో యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తెగదెంపులు చేసుకుని బిజెపికి మద్దతు చ్చారు .దేశంలో ప్రధాన నాయకులందరితోనూ చంద్రబాబుకు దాదాపు పరిచయాలు ఉన్నాయి.

 చంద్రబాబు ఎలా స్పందిస్తారో...

చంద్రబాబు ఎలా స్పందిస్తారో...

చంద్రబాబు కన్నా ముందుండాలనే ఉద్దేశంతో జాతీయ రాజకీయాలపై కేసిఆర్ ప్రకటన చేశారు. శనివారంనాడు హైదరాబాదులోనే ఉన్నప్పటికీ చంద్రబాబు కేసీఆర్ ప్రకటనపై స్పందించలేదు. కేసీఆర్ ప్రకటనకు పవన్ కల్యాణ్ ఇప్పటికే మద్దతు ప్రకటించారు. చంద్రబాబు ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరమైన విషయమే.

హిందీ భాషపై పట్టు

హిందీ భాషపై పట్టు

కేసీఆర్ తన మాతృభాష తెలుగు మాదిరిగా ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలను ధారాళంగా మాట్లాడగలరు. ఇది కేసిఆర్‌కు కలిసి వస్తుందని భావిస్తున్నారు హిందీ మాట్లాడగలిగి ఉండడం ఉత్తరాది నేతలతో సంప్రదింపులకు బాగా ఉపకరిస్తుందని అంటున్నారు.

ఎందుకు ఇప్పుడే కేసీఆర్

ఎందుకు ఇప్పుడే కేసీఆర్

కాంగ్రెసుకు, బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా బిజెపిని వ్యతిరేకిస్తున్న శక్తులను, కేంద్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్న పార్టీలను కూడగట్టడానికి వీలవుతుందని కేసిఆర్ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలు, అంశాలపై మాట్లాడడం కేసీఆర్ నూతన ఆలోచనకు బీజం వేసిందని అంటున్నారు. నాగాలాండ్, త్రిపురల్లో కాంగ్రెసు ఒక్స సీటును కాంగ్రెసు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మేఘాలయలో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. ఈ స్థితిలోనే జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే ప్రకటన చేయడం వెనక కేసీఆర్ వ్యూహం ఉందని అంటున్నారు.

థర్డ్ ఫ్రంట్ అంత సులభం కాదు..

థర్డ్ ఫ్రంట్ అంత సులభం కాదు..


కేసిఆర్‌కు జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. మూడు ప్రయోగాలు అంతకు ముందు జరిగాయి. 1977లో జనతా పార్టీ, 1987లో నేషనల్ ఫ్రంట్, 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగాలు జరిగి విఫలమయ్యాయి. లోకసభలోని 543 స్తానాల్లో 14 రాష్ట్రాల్లోని 255 సీట్లకు కాంగ్రెసు, బిజెపిలకు మధ్యనే పోటీ ఉంటుది. మిగతా 15 రాష్ట్రాల్లోని 288 స్థానాల్లో పోటీ జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు మధ్య ఉంటుంది. అందువల్ల థర్డ్ ఫ్రంట్ జాతీయ స్థాయిలో గట్టెక్కడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది.

English summary
K. Chandrashekar Rao wants to upstage him by expressing his interest in national politics before Chandrababu Naidu does so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X