ఈసారి ఖైరతాబాద్ గణేషుడు ఎలా ఉండబోతున్నాడు?

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా నగరంలోని ఖైరతాబాద్ గణేషుడు అంటే దేశ వ్యాప్తంగా పేరుంది. మరి ఈసారి మన ఖైరతాబాద్ గణేషుడు ఏవిధంగా దర్శనమివ్వబోతున్నాడో తెలుసుకుందాం.

ఖైరతాబాద్ గణేషుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వారుండరంటే నమ్మండి. అంత ఘనంగా ఇక్కడ గణేషుని పూజ నిర్వహించి, నిమజ్జనం చేస్తారు. ఈసారి ఖైరతాబాద్ భారీ గణపతి త్రిశక్తిమయ మోక్ష గణపతిగా దర్శనమివ్వనున్నాడు.

59 అడుగుల ఎత్తు, 26 అడుగుల వెడల్పుతో ఇరువైపులా మహాలక్ష్మీ, మహా సరస్వతి దేవిలతో పాటు కుడివైపున వరంగల్ భద్రకాళి అమ్మవార్లతో కలిపి మూడు శక్తులతో భక్తుల పూజలు అందుకోబోతున్నాడు.

భారీ గణపతి తయారీ ప్రాంగణంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సింగరి సుదర్శన్, శిల్పి చినస్వామి రాజేంద్రన్, కన్వీనర్ సందీప్ రాజ్‌లు గురువారం నమూనా చిత్రాన్ని విడుదల చేశారు.

Khairatabad Ganesha 2015 Stands Out in Style

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణతో పాటు భారతదేశంలో కరువు రాకుండా ఉండేందుకు, సమస్త జనులు సుఖశాంతులతో ఉండాలని కాంక్షిస్తూ, మూడు శక్తులతో కూడిన గణపతి తయారు చేయాలని ప్రముఖ సిద్ధాంతి గౌరీభట్ల విఠల్ శర్మ సూచించిన మేరకు ఈ తరహా వినాయకుడిని తయారు చేస్తున్నట్లు వారు తెలిపారు.

భారీ సింహాసనం ముందు విల్చుని ఆరు చేతులతో భారీ ఆకారంలో గణపతి నిర్మాణాన్ని తయారు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మహాలక్ష్మీ, మహా సరస్వతిల విగ్రహాలు 10 అడుగుల ఎత్తులో వినాయకుడికి ఇరువైపులా దర్శనమివ్వనున్నట్లు తెలిపారు.

వీటితోపాటు గణపతికి ఎడమవైపున గజేంద్ర మోక్షాన్ని కనులారా వీక్షించే విధంగా విగ్రహాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. 20 అడుగుల ఎత్తు, ప్రత్యేక దేవాలయాన్ని పోలే ఆర్చితో రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

కుడివైపున వరంగల్‌లో కొలువు దీరిన భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని 20 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ 12వ తేదీన కర్రపూజతో వినాయకుడి తయారీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రస్తుతం వెల్డింగ్ పనులు చురుకుగా సాగుతున్నాయి.

ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ మాట్లాడుతూ విగ్రహ నమూనాలో స్వల్ప మార్పులుంటాయని అన్నారు. మహాలక్ష్మీ, మహా సరస్వతి విగ్రహాల వెనుక భాగంలో రెండు హంసలు వస్తాయని, భారీ గణపతి తలపై గొడుగు స్దానంలో పడగలతో కూడిన పాము ఉంటుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+