వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టికల్ 131 అస్త్రం: సుప్రీం కోర్టుకు కిరణ్, డౌట్స్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran to approach SC on Telangana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి బంతి పూర్తి కాలేదా? ఆయన ఇచ్చిన నోటీసు ఆఖరి బంతి కాదా? అంటే అవుననే అంటున్నారు. 'నోటీసు' కిరణ్ అమ్ములపొదిలోని ఓ అస్త్రం మాత్రమే అంటున్నారు. విభజన అంశంపై కిరణ్ సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారట. అందుకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారట కూడా. సుప్రీంకు వెళ్లేందుకు ఏ మార్గాన్ని అనుసరించాలన్న దానిపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నారట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ద్వారా విభజన వ్యవహారాన్ని సుప్రీం ముంగిట పెట్టే అంశాన్ని కిరణ్ తీవ్రంగా పరిశీలిస్తున్నారు.

కేంద్ర రాష్ట్రాల మధ్య లేదా రాష్ట్రాలకు మధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఈ ఆర్టికల్ కింద ఆయా ప్రభుత్వాలు నేరుగా సుప్రీంలో ఒరిజినల్ సూట్ దాఖలు చేయొచ్చు. సాధారణ దావా వేసినప్పుడు కారణాల(కాజ్ ఆఫ్ యాక్షన్)ను పరిశీలించి దాన్ని విచారణకు స్వీకరించాలా లేక తిరస్కరించాలా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. ఆర్టికల్ 131 కింద పిటిషన్ దాఖలు చేస్తే వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ అవుతాయి. సంబంధిత అంశంపై స్టే ఉంటుంది.

అందుకే కేంద్రంపై కాలుదువ్వుతున్న కిరణ్ ఈ ఆర్టికల్‌నే అస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నారట. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ ఈ ఆర్టికల్ కింద దావా వేస్తాయి. అయితే రాష్ట్ర విభజనకు సంబంధించిన వివాదం కేంద్రానికి సంబంధించిందా లేక అసెంబ్లీ పరిధిలోని అంశమా అన్నది పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రాల విభజనపై కేంద్రానికి పూర్తి అధికారాలిచ్చే ఆర్టికల్ 3 కంటే ఈ ఆర్టికల్ 131 శక్తివంతమైనదా అన్నది కూడా ముందుగా తేల్చాల్సి ఉంటుంది.

కేంద్రం తీసుకున్న విభజన నిర్ణయం అమలుకాక ముందే రాష్ట్రం కోర్టుకు వెళ్లవచ్చా అన్నది తేలాల్సి ఉంది. విభజన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొంది చట్టం రూపం దాల్చితేనే కేంద్ర నిర్ణయం అమల్లోకి వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బిల్లు రాష్ట్రపతి నుంచి వచ్చింది. కాబట్టి ఈ వ్యవహారం రాష్ట్రపతి, అసెంబ్లీకి సంబంధించిందా లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినదా అన్నది కూడా సందేహమే.

English summary
It is said that Chief Minister Kiran Kumar Reddy is thinking to approach Supreme Court on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X