ఢిల్లీలో ఉండే వారికేం తెల్సు: కేంద్రమంత్రులపై కిరణ్
హైదరాబాద్: కేంద్రమంత్రుల బృందం (జివోఎం) ఎదుట రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర కేంద్ర మంత్రుల పైన కూడా ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారట. రెండు రోజుల క్రితం కిరణ్ జివోఎం ఎదుట సమైక్య గళం వినిపించిన విషయం తెలిసిందే. విభజన ద్వారా వచ్చే సమస్యలను ఆయన ఏకరువు పెట్టారు.
కేంద్రమంత్రులు విభజనకు అంగీకరిస్తున్నారు కదా? ప్యాకేజీ అడుగుతున్నారు కదా? అని జివోఎం సభ్యులు ప్రశ్నించినప్పుడు కిరణ్ వారిపై విమర్శలు చేసినట్లుగా తెలుస్తోంది. విభజనకు అంగీరిస్తున్న కేంద్రమంత్రులకు స్థానిక పరిస్థితులు ఏం తెలుసునని వ్యాఖ్యానించారట.

వారు ఎప్పుడు ఢిల్లీలో ఉంటారని, అలాంటి వారికి రాష్ట్రంలోని స్థానిక పరిస్థితులు ఏం తెలుసునని జివోఎం సభ్యులతో వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. విభజన అంశం మీద పదకొండు అంశాల పైన అభిప్రాయం చెప్పాలని కిరణ్‌ను జివోఎం సభ్యులు కోరగా నిరాకరించినట్లుగా తెలుస్తోంది. సమైక్యం తప్ప మరొక దానికి ఆస్కారం లేదని ఆయన కుండబద్దలు కొట్టారట.
పంజాబ్, హర్యానాల రాష్ట్రాల విభజనను కిరణ్ జివోఎం సభ్యుల ముందు ఉదహరించారట. అసెంబ్లీ నుండి తీర్మానం లేకుండా విభజన కష్టమని చెప్పారట.












Click it and Unblock the Notifications