Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జయలలిత అక్రమాస్తుల కేసు:ఏప్రిల్ ఫూల్ అంటూ....వారిద్దరూ తెలుగువారే

జయలలిత అక్రమంగా ఆస్తులు సంపాదించారని సుబ్రమణ్యస్వామి కేసు దాఖలు చేసేందుకు ఆనాడు గవర్నర్ గా ఉన్న మర్రి చెన్నారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

చెన్నై:దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు వ్యవహరంలో నాడు, నేడు ఇద్దరు గవర్నర్లు కీలకంగా వ్యవహరించారు.అయితే యాధృచ్ఛికమే అయినా ఆ ఇద్దరూ గవర్నర్లు కూడ తెలుగువారే . అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్ళేందుకు నాడు మర్రి చెన్నారెడ్డి కారణం కాగా, ఈ కేసులో తీర్పు వచ్చే వరకు వేచి చూసి శశికళ సిఎం కాకుండా విద్యాసాగర్ రావు కారణమయ్యారు.

తమిళనాడు రాష్ట్రంలో జయలలిత మరణించిన తర్వాత రాజకీయంగా అనేక కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. అన్నాడిఎంకెలో అధికారం కోసం నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈ రెండు గ్రూపులు అధికారం కోసం పావులు కదుపుతున్నాయి.

తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ పెల్వం, అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ రెండు గ్రూపులుగా విడిపోయారు.ఈ రెండు గ్రూపులుగా కూడ అదికారం కోసం పావులు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ప్రయత్నించిన శశికళకు సుప్రీంకోర్టు కేసు అడ్డుగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకొనేందుకు గాను పళని స్వామిని అన్నాడిఎంకె శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నుకొంది శశికళ వర్గం.

ఇద్దరూ తెలుగు వారే

ఇద్దరూ తెలుగు వారే

తమిళనాడు రాష్ట్ర గవర్నర్లుగా ఇద్దరు తెలుగు వారు ఉన్న కాలంలోనే జయలలిత అక్రమాస్తుల కేసులో కీలకమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి.21 ఏళ్ళ పాటు ఈ కేసులో అనేక కీలకమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. జయలలితతోపాటు శశికళ కూడ ఈ కేసులో శిక్షను అనుభవించారు. తాజాగా శశికళ మరోసారి జైలు శిక్ష విధిస్తూ సుప్రీం తీర్పు విధించింది.జయలలితపై అక్రమాస్తుల కేసు వేసేందుకుగాను నాడు ఆ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న మర్రి చెన్నారెడ్డి అనుమతిచ్చారు. ఈ కేసు ద్వారానే జయలలిత జైలుకు వెళ్ళారు. ఇదే కేసులో తాజాగా వచ్చిన తీర్పు ద్వారా శశికళ మరోసారి జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో తమిళనాడు గవర్నర్ గా విద్యాసాగర్ రావు ఉన్నారు.

.జయపై సుబ్రమణ్యస్వామి కేసు

.జయపై సుబ్రమణ్యస్వామి కేసు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక్క రూపాయి వేతనాన్నే జయలలిత తీసుకొంటానని ప్రకటించారు.అయితే రూపాయి వేతనం తీసుకొంటున్న జయలలిత ఆస్తులు ఎలా కూడబెట్టారంటూ జయలలితపై సుబ్రమణ్యస్వామి కేసు వేశారు.జయపై సుబ్రమణ్యస్వామి వేసిన కేసు ప్రస్తుతం శశికళకు ముఖ్యమంత్రి పీఠం దక్కకుండా చేసింది.అంతేకాదు పలుమార్లు జయలలిత ముఖ్యమంత్రి పీఠం నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడ నెలకొంది.

ఏప్రిల్ ఫూల్ తో ప్రారంభమై

ఏప్రిల్ ఫూల్ తో ప్రారంభమై

జయలలితపై ఏప్రిల్ పూల్ తో ఈ కేసు ప్రారంభమైంది.నిజానికి ఈ కేసును తొలుత అంత జోక్ గానే తీసుకొన్నారు.కాని, సుబ్రమణ్యస్వామి బాంబు పేల్చడంతో అందరూ షాక్ తిన్నారు.1995 ఏప్రిల్ 1వ, తేదిన సుబ్రమణ్యస్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేసి జయలలితపై కేసు వేస్తున్నట్టు ప్రకటించారు.అయితే ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారా అని ఓ పాత్రికేయుడు సుబ్రమణ్యస్వామిని ప్రశ్నించారు.అయితే తాను జయలలితపై కేసు వేసేందుకుగాను అప్పటి గవర్నర్ మర్రి చెన్నారెడ్డి అనుమతిచ్చారని ఆయన ఓ లేఖను బయటపెట్టాడు. ఈ లేఖలో మర్రిచెన్నారెడ్డి సంతకం చేశారు.ముఖ్యమంత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు అనుమతివ్వడం ఇదే ప్రథమం.

జయను జైలు పాల్జేసిన కేసు

జయను జైలు పాల్జేసిన కేసు

రూ.66.5 కోట్ల అక్రమాస్తులపై 1996 లో కేసు నమోదైంది. 21 ఏళ్ళపాటు ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. గత ఏడాదే సుప్రీం కోర్టు తీర్పు వరకు వెళ్ళింది. గత జూన్ 10వ, తేదిన కేసు విచారణ ముగిసింది. అయితే ఈ తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి జయలలిత ఇప్పటికే రెండు దపాలు జైలుకు వెళ్ళింది.రాజకీయంగా ఆమెను ఇబ్బందుల పాలు చేసింది కూడ ఈ కేసే. జైలులో ఉన్న కాలంలో ఆమె పలు ఆరోగ్య సమస్యలకు గురయ్యారు. సుప్రీంకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మరోసారి జైలుకు వెళ్ళాల్సి వస్తోందనే మానసిక ఒత్తిడికి గురయ్యారు జయలలిత.ఈ కారణాలతోనే మధుమేహం విపరీతంగా పెరిగి తీవ్ర అనారోగ్యానికి గురిచేసింది.అంతేకాదు ప్రాణాలను కూడ కోల్పోయింది.ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠమెక్కేందుకు సిద్దమైన శశికళ పతనానికి కూడ ఈ కేసే కారణంగా మారింది.

చెన్నారెడ్డి, జయలలితకు మధ్య విబేధాలు

చెన్నారెడ్డి, జయలలితకు మధ్య విబేధాలు

జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ రాష్ట్ర గవర్నర్ గా మర్రి చెన్నారెడ్డి పనిచేశారు.అయితే మర్రి చెన్నారెడ్డికి , జయలలితకు సత్సంబంధాలు లేవని చెబుతారు. ఈ కారణంగానే జయలలితపై కేసును వేసేందుకుగాను గవర్నర్ చెన్నారెడ్డి అనుమతి ఇచ్చారనే ప్రచారం కూడ లేకపోలేదు. వీరిద్దరి మద్య విబేధాల కారణంగానే కేసు ఎదుర్కోవాల్సి వచ్చిందని కూడ జయలలిత కోర్టులకు వివరించాల్సిన పరిస్థితి వచ్చింది.

మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ

మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ

తనపై కేసు వేసేందుకుగాను గవర్నర్ ఇచ్చిన అనుమతిని నిషేధించాలంటూ మద్రాసేు హైకోర్టులో జయలలిత దాఖలు చేసిన పిటిషన్ ను ఆనాటి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి శివరాజ్ పాటిల్ విచారించారు. ఆ విచారణ సందర్భంగా జయ తరపున న్యాయవాది పరాశరన్ తన వాదనలను విన్పించారు. రాజకీయ కుట్రలతో పాటు, గవర్నర్ కు ముఖ్యమంత్రికి మధ్య ఏర్పడిన మనస్పర్థలే ఈ కేసుకు కారణమయ్యాయని ఆయన వాదించారు. కేసును రద్దుచేయాలని కోరారు.అయితే కేసును రద్దు చేయకుండా డివిజన్ బెంచ్ కు మారుస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకొన్నారు.

ఈ కేసు విచారణలో ఉండగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు

ఈ కేసు విచారణలో ఉండగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు

2001 లో జరిగిన ఎన్నికల్లో అన్నాడిఎంకె పార్టీ తమిళనాడు రాష్ట్రంలో విజయం సాధించింది. దీంతో జయలలిత మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు.అయితే జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున కేసు విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరుతూ కేసును కర్ణాటక రాష్ట్రానికి బదిలీ చేయాలని డిఎంకె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కేసును బెంగుళూరు కోర్టుకు మారుస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కోర్టు జయ కేసును విచారించి 2014 సెప్టెంబర్ 27న, కీలకమైన తీర్పు ఇచ్చింది.జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ జరిమానాలు విధించింది.అయితే జయ బృందం సుప్రీం కోర్టును ఆశ్రయించి అక్టోబర్ 18న, బెయిల్ పొందారు. 21 రోజుల శిక్ష అనంతరం జైలు నుండి విడుదలయ్యారు. ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కర్ణాటక హైకోర్టు 2015 మే 11న, శిక్షను రద్దుచేసింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం అప్పీల్ చేయడంతో సుప్రీం కోర్టు తాజా తీర్పును వెలువరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+