"పెళ్లిళ్లకు టికెట్స్ అమ్ముకోవచ్చు.." (ఫోటోలు)

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : మార్కెటింగ్ వ్యవస్థ దేన్ని వదలదు.. సాంప్రదాయాలను సైతం ఫక్తు వ్యాపార ధోరణికి కేరాఫ్ గా మార్చుకుంటూ తన పరిధిని మరింత విస్తరించుకుంటోంది. మార్కెట్ శక్తులు తలుచుకుంటే తలొగ్గని వ్యవహారం ఏముంటుంది..! ఏదైనా సరే అమ్ముడు పోవాల్సిందే. ఆర్థిక శక్తులే ప్రపంచాన్ని శాసిస్తోన్న చోట సాంప్రదాయాలనూ మూటగట్టి అమ్ముకునే పరిస్థితి.

ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు భారతీయ వివాహా వ్యవస్థపై పడ్డ విదేశీ మార్కెట్ శక్తుల కన్ను.. ఒకరకంగా వివాహాలనూ టూరిజం కింద మార్చే ప్రయత్నం చేస్తోంది. అంటే, భారతీయ వివాహాలను మార్కెట్ కు అనుగుణంగా గ్లామరైజ్ చేసి.. 'షో' కేస్ లో పెట్టి అమ్మేసుకోవడన్నమాట. మొత్తానికి ఇలా.. పెళ్లిళ్లను పెట్టుబడులకు అడ్డాగా మార్చుకుని సంపాదించుకునే రోజులొచ్చేశాయి.

అసలేంటీ వ్యవహారం..! పెళ్లిళ్లకు టికెట్లు అమ్ముకోవడమేంటి..? పూర్తి వివరాలు తెలియాలంటే స్లైడ్స్ లో..

విదేశీయులకు భారతీయ పెళ్లిళ్లు ఓ వింత..

విదేశీయులకు భారతీయ పెళ్లిళ్లు ఓ వింత..

సాంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారతదేశంలో.. ప్రపంచ దేశాలతో పోల్చితే ఇక్కడి వివాహ వ్యవస్థ చాలా భిన్నమైనది. ఈ ఆలోచనే ఇప్పుడు ఓ స్టార్టప్ కు ముడిసరుకుగా మారింది. దేశీ పెళ్లిళ్లను వింతగా భావించే విదేశీయులకు దీన్నో టూరిజం తరహాగా మార్చేయబోతుంది.

పెళ్లిళ్లకు టికెట్లు..

పెళ్లిళ్లకు టికెట్లు..

సినిమాకి వెళ్తే టికెట్ కొనుక్కుంటాం.. ఎందుకంటే అదో వినోదం కాబట్టి.. విహారయాత్రలకు వెళితే ప్యాకేజీ టికెట్స్ కొనుక్కుంటాం.. అదీ వినోదమే కాబట్టి. ఇదీ అంతే.. ఇండియన్ పెళ్లిళ్లను చూడాలని ముచ్చట పడే, దాన్నో వినోదంగా భావించే విదేశీయులకు ' పెళ్లి టికెట్' రేట్లను ఫిక్స్ చేసి సదరు పెళ్లి కుటుంబాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది ఓ సంస్థ.

అసలెవరదీ ఐడియా..?

అసలెవరదీ ఐడియా..?

joinmywedding.com అనే ఆస్ట్రేలియా స్టార్టప్ కు వచ్చిందీ ఐడియా. ఇండియన్ పెళ్లిళ్లను చూడాలనుకునే విదేశీయులకు ఈ సైట్ ద్వారా పెళ్లి టికెట్స్ అమ్ముతారు. అందులో కొంత కమిషన్ ను పెళ్లి చేసుకోబోతున్న దంపతులకు చెల్లిస్తారు.

పాజిటివ్ యాంగిల్

పాజిటివ్ యాంగిల్

అయితే.. పెళ్లిళ్లంటేనే లక్షల వ్యవహారంతో కూడుకున్న నేటి తరుణంలో.. ఇలాంటి ఆఫర్స్ ద్వారా పెళ్లి కుటుంబాలకు డబ్బులు ఆదా అవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ముంబై ఉదయ్ పూర్, ఇండోర్ లాంటి చోట్ల ఇప్పటికే సదరు సంస్థ 'పెళ్లి టికెట్స్' వ్యవహారం కొనసాగుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Foreign company saling indian marriage tickets for foreigners that who are interested in indian marriage ceremony. A website booking those tickets and offering some amount to marriage family

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి