తన క్లాస్ విద్యార్థుల కోసం నగలు అమ్మిన ఉపాధ్యాయురాలు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సదుపాయాలు ఉండవు. చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కూడా ఇబ్బందే.
చెన్నై: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సదుపాయాలు ఉండవు. చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కూడా ఇబ్బందే. ఉపాధ్యాయులు ఉన్న సదుపాయాలతో చదువు చెబుతారు.
అయితే, తమిళనాడులో ఓ ఉపాధ్యాయురాలు మాత్రం పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చదువు కోసం తన నగలు అమ్మి వేయాలని నిర్ణయించుకుంది. ఆమె పేరు అన్నపూర్ణ మోహన్. విల్లుపురంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు చెబుతోంది.

తమ క్లాస్ పిల్లలకు మంచి విద్యను అందించేందుకు తన నగలను అమ్మివేసింది. తద్వారా తన క్లాస్ రూంకు ఇంటర్నేషనల్ లుక్ ఇవ్వాలని భావించింది.
ఆమె మూడో తరగతి క్లాస్ టీచర్. ఆ తరగతి గదిలో ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్మార్ట్ బోర్డు, ఫర్నీచర్ తదితర అన్ని సౌకర్యాలను కల్పించింది. ప్రయివేటు స్కూల్లో పిల్లలకు ఉండే సౌకర్యాలకు ధీటుగా తీసుకు వచ్చింది.
ఆమె ప్రయత్నం తోటి ఉపాధ్యాయులను, పిల్లల తల్లిదండ్రులను అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియా కూడా ఆమె మంచి ప్రయత్నాన్ని ప్రసంసిస్తోంది. అన్నపూర్ణ మోహన్ తన క్లాస్ పిల్లలకు ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ మాట్లాడేలా ప్రోత్సహిస్తోంది.
తన క్లాస్ రూంలో మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నానని, తాను పిల్లలతో ఇంగ్లీష్‌లో మాట్లాడి ప్రోత్సహిస్తానని, పిల్లలకు చిన్నప్పుడే ముఖ్యమని ఆ టీచర్ చెబుతోంది. తాను ఏదీ బరువుగా భావించడం లేదని, తనకు తోచినంత సాయం చేస్తానని చెబుతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications