నారాయణ కుమారుడి దుర్మరణం:నిషిత్ నడిపిన లగ్జరీ కారు, దాని స్పెషాలిటీస్ ఇవే!
మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ మోడల్ కారు.. కేవలం కేవలం 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం కలిగి ఉండటం గమనార్హం.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మంత్రి నారాయణ కుమారుడి దుర్మరణం చర్చనీయాంశంగా మారింది. గతంలో
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అజహరుద్దీన్ వంటి ప్రముఖుల కుమారులు రోడ్డు ప్రమాదంలోనే మరణించడం, తాజాగా నారాయణ కుమారుడిని సైతం ప్రమాదమే బలి తీసుకోవడం చాలామందిని కలచివేసింది.
ప్రమాద వార్త తెలియగానే చాలామంది ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లయితే.. ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరుగుతోందని, రాత్రిపూట పబ్స్, బార్లు అంటూ తిరుగుతున్నారని ఒకింత ఘాటుగానే స్పందించారు.
కుటుంబాన్ని ఉద్దరించాల్సింది పోయి రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి చెందడం జీర్ణించుకోవడానికి కష్టమన్నారు. కాగా, గతంలో ప్రమాదం బారిన పడిన ప్రముఖుల పిల్లలు కూడా లగ్జరీ కార్లలో అతివేగంగా ప్రయాణించడం వల్లే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో నారాయణ కుమారుడు నిషిత్ ప్రయాణించిన కారు కూడా అత్యంత లగ్జరీ కారు అని తెలుస్తోంది.

మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ మోడల్ కారు.. కేవలం కేవలం 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం కలిగి ఉండటం గమనార్హం.
ఇవే ప్రత్యేకతలు:
కారు మోడల్-మెర్సిడెస్ ఏఎంజీ జీ63
వేగం- గంటకు 230 కి.మీ, 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం
ధర - రెండున్నర కోట్ల రూపాయలు
ఇంజిన్ ఎనర్జీ - 420 కిలోవాట్, హార్స్ పవర్ - 571
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications