జగన్, నిమ్మగడ్డల కోసమా: మోడీతో నాగ్ వెనుక?
హైదరాబాద్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున సోమవారం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలవడం వెనుక కారణాలను తెలుగుదేశం పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట. టిడిపి, బిజెపి మధ్య సీట్ల పంపకాలపై ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.
పొత్తుపై చర్చలు జరుగుతుండగానే టాలీవుడ్ ప్రముఖులు మోడీని కలుస్తుండటంపై టిడిపి దృష్టి సారించిందట. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు నాగార్జున వ్యాపార భాగస్వామి.

నిమ్మగడ్డను కలవడానికి నాగార్జున అనేకసార్లు చంచల్‌గూడ జైలుకు వెళ్లి వచ్చారు. జగన్, నిమ్మగడ్డల తరఫునే నాగార్జున బిజెపికి దగ్గరవుతున్నారని, బిజెపి అధికారంలోకి వస్తే తన మిత్రులకు ఉపయోగపడటం నాగార్జున లక్ష్యం కావచ్చునని టిడిపి వర్గాలు భావిస్తున్నాయట.
మరోవైపు నాగార్జున వ్యాపార భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు కూతురు దీపా వెంకట్‌కు చెందిన పాఠశాలకు కొంత డొనేషన్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు, సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బిజెపితో పొత్త వైపు తమ అడుగులు వేయాలని టిడిపి నాయకత్వం భావిస్తోందని చెబుతున్నారు. సీట్లు పంచుకొనే విషయంలో బిజెపి ఒత్తిడికి లొంగరాదని, ఆచితూచి వెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications