హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: మద్యం తాగినా, సిగ్నల్ జంప్ చేసినా లైసెన్స్ రద్దు, కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే

ఇక ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్స్ లను రద్దు చేయనున్నారు. ఇప్పటివరకు జరిమానాలతో వదిలేసిన అధికారులు ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ లనే రద్దు చేయనున్నారు. కొత్త ట్రాపిక్ రూల్స్ ను తెలంగాణ ప్రభుత్వం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇక ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్స్ లను రద్దు చేయనున్నారు. ఇప్పటివరకు జరిమానాలతో వదిలేసిన అధికారులు ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ లనే రద్దు చేయనున్నారు. కొత్త ట్రాపిక్ రూల్స్ ను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ రూల్స్ ను అమల్లోకి తీసుకువచ్చింది.ఈ విధానం అమల్లోకి రావడం వల్ల ఇక జాగ్రత్తగా రోడ్లపై వాహనాలను నడపాల్సి ఉంటుంది.

వాహనాలను ఇదివరకు మాదిరిగా ట్రాఫిక్ ఉల్లంఘిస్తూ నడిపితే డ్రైవర్ లైసెన్స్ ను రద్దు చేస్తారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి పాయింట్లను కేటాయిస్తారు. ఈ పాయింట్ల సంఖ్య ఐదు దాటితే లైసెన్స్ ను రద్దు చేస్తారు.

పాయింట్ల ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.ఈ పాయింట్ల సంఖ్య పెరిగితే డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయనున్నారు.

కొత్త రూల్స్ తో జాగ్రత్త

కొత్త రూల్స్ తో జాగ్రత్త

గత ఏడాది సెప్టెంబర్ లో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ రూల్స్ విషయమై నోటిఫికేషన్ ను జారీ చేసింది.అయితే దాన్ని అమల్లోకి తెచ్చింది మాత్రం ఇప్పుడే. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. చలానా కట్టేస్గే సరిపోతోందనే ధీమాతో పదే పదే నిబంధనలు ఉల్లంఘించేవారికి ఇక ఈ కొత్త విధానంతో ముకుతాడు పడుతోంది.ఈ నిబంధనల కారణంగా భారీ ప్రమాదాలను తప్పించే అవకాశాలున్నాయని రవాణాశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

పాయింట్లతో పరేషాన్

పాయింట్లతో పరేషాన్

కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా పాయింట్లను కేటాయించనున్నారు. పాయింట్ల సంఖ్య ఐదు దాటితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు రవాణాశాఖాధికారులు.కొత్తరూల్స్ తో వాహనదారులకు చుక్కలు కన్పిస్తాయి.ఆటోలో డ్రైవర్ సీటులో అదనంగా ప్రయానీకులను ఎక్కించుకొంటే 1 పాయింట్ కేటాయిస్తారు. సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణీకులను ఎక్కించుకొంటే 2 పాయింట్లు, హెల్మెట్ సీట్లు, బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపితే 1 పాయింట్, రాంగ్ రూట్ లో వాహనం నడిపితే ఒక్క పాయింట్ నిర్ధేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ. లోపు వేగంతో వెళ్తే రెండు పాయింట్లు, నిర్ధేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ. కన్నా ఎక్కువ వేగంతో వెళ్తే మూడు పాయింట్లు కేటాయిస్తారు.

సిగ్నల్ జంప్ చేస్తే ఇక అంతే

సిగ్నల్ జంప్ చేస్తే ఇక అంతే

సిగ్నల్ జంప్ చేసినా, ప్రమాదకరంగా వాహనం నడిపినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపినా రెండు పాయింట్లు కేటాయిస్తారు. మద్యం తాగి బైక్ నడిపినా, రేసింగ్స్, మితిమీరిన వేగంతో దూసుకెళ్తే మూడు పాయింట్లు, మధ్యం తాగి ఫోర్ వీలర్, లారీ, సరుకు రవాణ వాహనం నడిపితే నాలుగు పాయింట్లు కేటాయిస్తారు.మద్యం తాగి ప్రయాణీకులుండే బస్సులు, క్యాబ్, ఆటోలను నడిపితే 5 పాయింట్లు కేటాయిస్తారు. ఇబ్బంది కలిగేలా వాహనాన్ని నడిపినా, వాయు కాలుష్యానికి కారణమైనా అనుమతిలేని చోటు పార్క్ చేసినా రెండు పాయింట్లు కేటాయిస్తారు.భీమా పత్రం లేకుండా వాహనం నడిపితే రెండు పాయింట్లు, అనుమతిపత్రం ేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే రెండు పాయింట్లు, ర్యాష్ డ్రైవింగ్, ఎదుటివారి భద్రతకు ముప్పు వాటిల్లేలా నడిపితే రెండు పాయింట్లు, నిర్లక్ష్యంగా నడిపి ఎదుటివారి మృతికి కారణమైతే 5 పాయింట్లు, వాహనం నడుపుతూ చైన్ స్నాచింగ్, దోపిడి, ఇతర నేరాలకు పాల్పడితే 5 పాయింట్లు కేటాయిస్తారు.

పాయింట్లను తగ్గించుకోవడం ఇలా

పాయింట్లను తగ్గించుకోవడం ఇలా

ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో వాహనాల నిబంధనలు, ప్రమాదాల నివారణ అంశాలపై నిర్వహించే అవగాహన తరగతులకు హాజరైతే అప్పటివరకు వాహనదారుడి ఖాతాలో నమోదైన పాయింట్ల నుండి మూడు పాయింట్లను తగ్గించుకొనే అవకాశం ఉంటుంది. అయితే రెండేళ్ళలో రెండు సార్లు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

కీలకం కానున్న సీసీ కెమెరాలు

కీలకం కానున్న సీసీ కెమెరాలు

ప్రస్తుతం ట్రాఫిక్ కూడళ్ళలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా వాహనదారులు ఉల్లంఘనలను గుర్తించి ట్రాఫిక్ పోలీసులు ఈ చలానాలు పంపుతున్నారు. త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో కూడళ్ళలోనే కాకుండా సాధారణ ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘించినా కెమెరా కంటికి కన్పిస్తారు.ఆయా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ కు పాయింట్లు కేటాయిస్తారు. వాటిని రవాణా శాఖ డేటా బేస్ కు ఎప్పటికప్పుడు లెక్కకడుతుంటారు. రెండేళ్ళ సమయాన్ని గడువుగా చేసుకొని ఈ పాయింట్ల సంఖ్యను బేరీజు వేస్తారు. 24 నెలల కాలంలో పాయింట్ల సంఖ్య 12కు చేరితే ఏడాది పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. మళ్ళీ కొత్త ఖాతా మొదలౌతోంది. మళ్ళీ 24 నెలల్లో 12 పాయింట్లు వస్తే రెండేళ్ళపాటు తదుపరి పునరావృతమైతే మూడేళ్ళపాటు లైసెన్స్ ను రద్దు చేస్తారు.

English summary
New driving license rules implemented Telangana government from April 24, 2017. if anyone violates traffice rules transport department cancel driving license.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X