దీపావళి: వైట్‌హౌజ్‌లో తొలిసారి దీపాన్ని వెలిగించారు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన అధికారిక కార్యాలయంలో తొలిసారి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. చరిత్రలో తొలిసారి వైట్‌హౌజ్‌లోని ఓవల్ ఆఫీస్‌లో దీపాన్ని వెలిగించారు. తన తర్వాత వచ్చిన అధ్యక్షులు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన దగ్గర పనిచేసే ఇండియన్ అమెరికన్స్‌తో కలిసి ఆయన పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఒబామా మాట్లాడారు. '2009లో నేను , మిచెల్ దీపావళీ జరుపుకొన్నప్పుడు భారతీయులు సంతోషించారు. మేము ముంబై వెళ్లినప్పుడు మమ్మల్ని ఎంతో గౌరవంగా ఆహ్వనించారు. ఆ అనుభవాన్ని మర్చిపోలేను. దీపావళి సందర్భంగా ఈ సారి నా కార్యాలయంలో మొట్టమొదటి దీపం వెలిగించిన అనుభవం మర్చిపోలేను. దీనిని చూస్తే చీకటి తర్వాత వెలుగు వస్తుందని మనకు అర్థమవుతుంది. ఈ సంప్రదాయాన్ని భవిష్యత్తులో వచ్చే అధ్యక్షులు కూడా పాటిస్తారని భావిస్తున్నాను. మీరు, మీకు ఇష్టమైనవారు ఈ దీపావళికి సుఖసంతోషాలతో ఉండాలని ఒబామా కుటుంబం తరపున కోరుకుంటున్నాను' అని ఒబామా అన్నారు.

'ఇప్పుడు ఓవల్ ఆఫీస్‌లో దీపం వెలిగించిన తొలి అధ్యక్షుడిగా నిలిచే గౌరవం కూడా నాకే దక్కింది. చీకటిపై ఎప్పటికీ వెలుగుదే ఆధిపత్యం అని తెలియజెప్పే గొప్ప సాంప్రదాయం ఇది. దీన్ని భావి అధ్యక్షులుగా కూడా కొనసాగించాలని ఆశిస్తున్నా' అని ఒబామా వైట్‌హౌజ్ ఫేస్‌బుక్ పేజీలో అభిప్రాయపడ్డారు.
కాగా, ఈ విషయాన్ని వైట్‌హౌస్ ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసిన వెంటనే 1.5లక్షల లైకులు, 33,000 షేర్లు వచ్చాయి. దీపావళి సందర్భంగా హిందూ, సిక్కు, జైన్, బౌద్ధులకు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లింటన్ మాట్లాడారు. 'ప్రపంచ వ్యాప్తంగా వందకోట్ల మంది హిందు, సిక్కు, బౌద్ధ, జైనులు, రెండు కోట్ల మంది అమెరికన్లు ఈ దీపావళిని ఘనంగా జరుపుకొంటారు. దీపం చెడుపై విజయానికి చిహ్నంగా నిలుస్తుంది' అని అన్నారు.












Click it and Unblock the Notifications