అన్నయ్య ప్రజారాజ్యమే గుణపాఠం: జగన్‌తోనే కాదు, బాబుతోనూ ఢీ

రాజకీయాల్లో తన సత్తా చాటేందుకు పక్కా ప్రణాళికతో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నట్లు అర్థమవుతోంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని కూడా ఆయన ఎదుర్కోవడానికే సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.

Recommended Video

    Pawan Kalyan Has Prepared To Face Chandrababu Along With Jagan In 2019 Polls | Oneindia Telugu

    హైదరాబాద్: రాజకీయాల్లో తన సత్తా చాటేందుకు పక్కా ప్రణాళికతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నట్లు అర్థమవుతోంది. అక్టోబర్ నుంచి ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలను నడిపించడానికి పూనుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని కూడా ఆయన ఎదుర్కోవడానికే సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద కూడా ఆయనకు స్పష్టమైన వైఖరే ఉన్నట్లు శుక్రవారం మాట్లాడిన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో ఆయన రాజకీయ వైరం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

    చంద్రబాబుపై, జగన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. తెలంగాణలోనూ అడుగుపెడుతానని ఆయన అంటున్నారు. తెలంగాణలో అడుగుపెడతే ఈ రాష్ట్రంలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతాయా అనేది చూడాల్సి ఉంది.

    ప్రత్యేక హోదాపై ఇలా...

    ప్రత్యేక హోదాపై ఇలా...

    ప్రత్యేక హోదాపై తాను ఉద్యమాన్ని ఆపలేదని, తనపై కేసులు పెట్టినా భయపడనని, జైలుకు పంపినా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. కేంద్రంతో పోరాడుతున్నందునేవారికి తనపై కోపమని ఆయన అన్నారు. ఆయన బిజెపిని ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లు ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

    బాబు, జగన్‌లపై ఇలా...

    బాబు, జగన్‌లపై ఇలా...

    ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌ కేంద్రంతో పోరాడేందుకు భయపడుతున్నారని, తనకా భయం లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. అక్టోబరు నుంచి ప్రజల్లో వెళ్లి, రైతులు, పరిశ్రమలకు సంబంధించిన సమస్యలపై పోరాడతానన్నారు. తాను రాజకీయ ప్రయోజనం కోసం రాజకీయాల్లోకి రాలేదని, సినిమాల్లో ఉన్నా ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నానని చెప్పారు.

    ఎందుకా భయం...

    ఎందుకా భయం...

    జగన్, చంద్రబాబు కేంద్రంపై పోరాడేందుకు భయపడుతున్నారని పవన్ కల్యాణ్ చెప్పిన మాటల్లోని ఆంతర్యాన్ని విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. వారి భయమేమిటో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు చేసుకుంటున్న పరస్పర విమర్శలే ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. కేసుల నుంచి బయటపడడానికి జగన్ కేంద్రానికి లొంగిపోయారని, ప్రత్యేక హోదా కోసం ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పి దానివల్లనే వెనక్కి తగ్గారని తెలుగుదేశం పార్టీ విమర్సిస్తుండగా, ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు కేంద్రానికి లొంగిపోయారని వైసిపి విమర్శలు చేస్తోంది.

    ఇలాగే ఉంటుంది...

    ఇలాగే ఉంటుంది...

    తాను రాజకీయాల్లో అనుసరించబోయే పంథాపై పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చినట్లే అనిపిస్తోంది.సహజంగా ఎవరైనా గళమెత్తితే.. ప్రశ్నిస్తే.. ఎదుటివారికి కాస్త అసహనం వస్తుందని, తనపైనా ఇదే ధోరణి వ్యక్తమవుతోందని, పట్టించుకోనని చెప్పారు. తిట్టినా పట్టించుకోనన్నారు. అయితే సహనానికీ హద్దు ఉంటుందని అంటూ ఎవరైనా కొడుతుంటే చేతిని అడ్డుపెట్టుకోవద్దంటే ఎలాగని ప్రశ్నించారు. దీన్ని బట్టి రాజకీయాల్లో ఆయన అనుసరించబోయే తిరుగుబాటు ధోరణిని అర్థం చేసుకోవచ్చు.

    తెలంగాణలో కూడా...

    తెలంగాణలో కూడా...

    తాను ఎక్కువగా తెలంగాణలోనే పర్యటించానని పవన్‌ చెప్పారు. ఏ సమస్యలు వచ్చినా తెలంగాణలో ఎక్కడైనా తిరుగుతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా రంగంలోకి దిగేందుకు ఆయన సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. జనసేన తెలంగాణలో పోటీ చేస్తే నష్టపోయేది కాంగ్రెసు పార్టీయా, తెలంగాణ రాష్ట్ర సమితియా అనే విషయంంపై ఇప్పుడే అంచనాకు రావడంం కష్టం. అయితే, వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతామనే పూర్తి విశ్వాసంతో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాత్రం పవన్ కల్యాణ్ విషయంలో అప్రమత్తం కాక తప్పదు.

    ప్రజారాజ్యం వైఫల్యం నుంచి...

    ప్రజారాజ్యం వైఫల్యం నుంచి...

    ప్రజారాజ్యం పార్టీ ఫెయిలవ్వడం వల్ల ఆ పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని నిరూపించుకోవలసిన అవసరం తనకుందని పవన్ కల్యాణ్ అన్నారు.. పాతికేళ్లు సమాజం కోసం, పార్టీ కోసం కష్టపడేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తనను సమగ్రంగా పరిశీలించాకే.. రాజకీయాల్లో తనతో కలసి నడవాలని పవన్ కల్యాణ్ తన అభిమానులను కోరారు. తుది మేనిఫెస్టో విడుదలయ్యాకే సభ్యత్వ నమోదు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి ప్రజారాజ్యం వైఫల్యాలను ఆయన అంచనా వేసినట్లే కనిపిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+